iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు TSRTC గుడ్ న్యూస్..!

  • Published May 20, 2024 | 10:34 AM Updated Updated May 20, 2024 | 10:34 AM

TSRTC Good News: తెలంగాణలో ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది టీఎస్ ఆర్టీసీ.ఈ క్రమంలోనే ఆర్టీసీ సేవల్లో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

TSRTC Good News: తెలంగాణలో ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది టీఎస్ ఆర్టీసీ.ఈ క్రమంలోనే ఆర్టీసీ సేవల్లో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published May 20, 2024 | 10:34 AMUpdated May 20, 2024 | 10:34 AM
హైదరాబాద్ వాసులకు TSRTC గుడ్ న్యూస్..!

హైదరాబాద్ లో ఇప్పుడు బస్ లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీంగా పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. నాటి నుంచి బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో టీఎస్ ఆర్టీసీ సేవలు ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు.. ఇతర పనులపై వెళ్లే వారితో బస్సులు కిట కిటలాడుతుంటాయి. ఓ పక్క మెట్రో సేవలు కొనసాగుతున్నా.. నిత్యం లక్షల సంఖ్యల్లో బస్సు ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. తాజాగా నగర వాసులకు టీఎస్ఆర్టీసీ ఓ అదిరిపోయే వార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో మెట్రో సేవల మాదిరిగా బస్సు సేవలు కూడా ఉండేలా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో ట్రైన్లు నడుస్తున్నాయి. రద్దీ ఎక్కువ ఉంటే.. ట్రైన్లు ఎక్కువ సంఖ్యలో నడుపుతున్నారు. మెట్రో స్టేషన్ లో ప్రయాణికులు ఎక్కువ సేపు వెయిట్ చేయ కుండా వెంట వెంటనే ట్రైన్లు నడుపుతున్నారు.ఇదే తరహాలో బస్సులు కూడా నడపాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి సికింద్రాబాద్ నుంచి మణికొండ, లింగంపల్లి నుంచి కోఠీ బస్సులకు టైమ్ స్లాట్స్ పెట్టారు. ఈ రెండు మార్గాల్లో ప్రయాణికకులు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పది నిమిషాలకు ఒక బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించుకున్నారు.

మెట్రో సౌకర్యం లేని మార్గాల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని, బస్సుల సంఖ్య మరింత పెంచాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి పథకం ప్రారంభం అయినప్పటి నుంచి బస్సుల్లో రద్దీ మరింత పెరిగిపోయింది. ఉచిత ప్రయాణాలతో బస్సుల్లో రోజువారి ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ రెట్టింపు కావడతంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది నాటికి సిటీలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు నడపడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ నిర్ణయంతో ప్రజల ఇక్కట్లకు కొంతమేరు చెక్ పెట్టవొచ్చని భావిస్తున్నారు ప్రజలు.