TSRTC MD VC Sajjanar: ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన TSRTC ఎండీ సజ్జనార్

ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన TSRTC ఎండీ సజ్జనార్

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలు, యువతులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. అయితే బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణీకులు. ఈ నేపథ్యంలో ఓ శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలు, యువతులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. అయితే బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణీకులు. ఈ నేపథ్యంలో ఓ శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు, యువతులు, ట్రాన్స్ జెండర్లు, విద్యార్థినులకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించింది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ ప్రీ జర్నీని అమలు చేసింది. ఈ నెల 9న ప్రారంభమైన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. రాష్ట్ర నివాసితులుగా నిర్దారించే గుర్తింపు కార్డు ఉంటే చాలు.. తెలంగాణ వ్యాప్తంగా సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగ పర్చుకుంటున్నారు. ఇదే సమయంలో రద్దీ పెరిగిపోయింది. కొన్ని రూట్లలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో బస్సులు సరిపోక.. ప్రయాణీకులు గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీనికి తోడు.. ఈ పథకం తీసుకు రావడంతో బస్సులు తగ్గించేశారన్న అపవాదు వచ్చింది. దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. త్వరలో కొత్త బస్సులు తీసుకువస్తామని ప్రకటించారు. ఆ వెంటనే అద్దెకు బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో శుభ వార్తను తీసుకు వచ్చారు సజ్జనార్. బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులకు కొత్త బస్సులు తెస్తున్నామంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. కొత్త ఎక్స్ ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకు వచ్చినట్లు తెలిపారు.

‘ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వినియోగంలోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరుగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఐఏఎస్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్, ఐఏఎస్ తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు’. అని ట్వీట్ చేశారు.

Show comments