iDreamPost
android-app
ios-app

TSRTC గుడ్ న్యూస్.. కొత్తగా ‘టి9-30’టికెట్స్!

  • Author Soma Sekhar Published - 09:19 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 09:19 PM, Wed - 26 July 23
TSRTC గుడ్ న్యూస్.. కొత్తగా ‘టి9-30’టికెట్స్!

ప్రయాణికులకు TSRTC శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కొత్త సంస్కరణలను, బస్ పాస్ లను తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. తాజాగా మరో బస్ పాస్ ను తీసుకొచ్చి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తక్కువ దూరం ప్రయాణించే వారికోసం టీఎస్ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికులకు అందుబాటులోకి కొత్తగా ‘టి9-30’ టికెన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే టి9-60 టికెట్ అందుబాటులో ఉండగా.. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు ఈ రాయితీ బస్ పాస్ ను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ.

హైదరాబాద్ బస్ భవన్ లో టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ టి9-30 టికెట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇక ఈ టికెట్ కు రూ. 50 చెల్లిస్తే.. 30 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించేటట్లు వెసులుబాటును కల్పించారు అధికారులు. కాగా.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఇక పాస్ లు ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తాయని, పల్లె వెలుగు బస్ కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

అయితే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ఇష్యూ చేస్తారని వారు వెల్లడించారు. మరోవిషయం ఏంటంటే? 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా ఈ టికెట్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ టికెట్ తీసుకున్న వారు తిరుగు ప్రయాణంలో మరో రూ. 20 టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఒక నెల వరకు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికుల స్పందనను బట్టి తర్వాత పొడిగిస్తామని, ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.


ఇదికూడా చదవండి: పెళ్లైన 5 ఏళ్లకు ట్విన్స్ కు జన్మనిచ్చిన బుల్లితెర నటి! పోస్ట్ వైరల్