Arjun Suravaram
ప్రస్తుతం వేసవి వేడి మాములుగా లేదు. బయటకు వెళ్లాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు. అయినా సమ్మర్ హాలిడేస్ కావడంతో చాలా మంది వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రస్తుతం వేసవి వేడి మాములుగా లేదు. బయటకు వెళ్లాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు. అయినా సమ్మర్ హాలిడేస్ కావడంతో చాలా మంది వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
ప్రస్తుతం సమ్మర్ హీట్ మాములుగా లేదు. బయటకు వెళ్లాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు. అయినా వేసవి కాలం సెలవులు కావడంతో చాలా మంది వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు సిద్ధమవుతున్నారు. ఇక ఎండల వేడికి బస్సుల్లో ప్రయాణం చేయాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. ఎక్కువ మంది తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. సమ్మర్ హీట్ ఉన్న కూడా భరిస్తూ ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు శ్రీశైలంకి ఎక్కువగా వస్తుంటారు. ఈ సమ్మర్ లో శ్రీశైలం వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిత్యం ఎందో మంది భక్తులు వస్తుంటారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఇక ఇది సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు, విద్యార్థుల స్కూల్స్ కి సెలవు ప్రకటించడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంటారు. తిరుపతితో పాటు చాలా మంది శ్రీశైలం కి కూడా ఈ సమ్మర్ లో వెళ్లేందుకు ప్రణాళికల వేస్తుంటారు. అయితే సమ్మర్ లో నార్మల్ బస్సులో జర్నీ చేయాలంటే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయినా అలా ఇబ్బందులు పడుతూనే చాలా మంది ఉక్కపోతతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు.
ఈ క్రమంలో శ్రీశైలంకి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి ప్రతి గంటకో బస్సును భక్తుల కోసం అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని జేబీఎస్ నుంచి ఈ బస్సులు నడుస్తున్నాయి. ఇక సికింద్రబాద్ నుంచి శ్రీశైలంకి రూ.524గా ఛార్జీలను నిర్ణయించారు. అలానే బీహెచ్ఈఎల్ నుంచి కూడా ఈ ఏసీ బస్సులు నడవనున్నాయి. బీహెచ్ఎల్ నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించింది.
అత్యాధునిక సౌకర్యాలతో, ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సుల్లో ప్రయాణించి.. హాయిగా శ్రీశైలం చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇలా ఏసీ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని టీఎస్ ఆర్టీసీ సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించగలరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను #TSRTC నడుపుతోంది. #Hyderabad నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ… pic.twitter.com/OMd2euufJc
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 25, 2024