iDreamPost

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన TSRTC!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన TSRTC!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తాజాగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 10వ తరగతితో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. TSRTC తాజాగా తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు టీఎస్ఆర్టీసీ తీసుకున్న తాజాగా డెసిషన్ ఏంటి? అసలు ఈ సంస్థ కల్పిస్తున్నట్లు ఆ ఉపాధి అవకాశాలు ఏంటంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. TSRTC నిరుద్యోగులకు ఐటీఐలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఐటీఐ కొత్త కళాశాలకు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కాలేజీని హకీంపేటలో ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నామన్నారు. ఇక అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మోటర్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో క్లాసులు భోదించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకుంటున్న విద్యార్థులు iti.telangana.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాగా, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువత.. ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని, 9వ తేదీన వాక్ ఇన్ ఆడ్మిషన్ నిర్వహించనున్నామని కూడా స్పష్టం చేశారు. ఇక శిక్షణ పూర్తైన అనంతరం విద్యార్థులు తెలంగాణలోని ఇష్టమైన ఆర్టీసీ డిపోలలో అప్రెంటిషీఫ్ ను కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. దీనిపై పూర్తి సమాచారం కోరకు 9100664452 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి