AP ఎన్నికలకు వెళ్లేవారికి TSRTC గుడ్‌న్యూస్.. వారి కోసం కీలక నిర్ణయం

AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం.. స్వస్థలాలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆ వివరాలు..

AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం.. స్వస్థలాలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సమ్మర్‌ హీట్‌ కన్నా ఎలక్షన్‌ వేడే ఎక్కువగా ఉంది. ఏపీలో మే 13 న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌లో గెలవడం కోసం అధికార, విపక్ష పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పోటాపోటి ప్రచార కార్యక్రమాలతో రాజకీయ వాతావారణాన్ని హీటేక్కిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కూడా ఎన్నికల క్యాంపెయిన్‌ పీక్స్‌కి చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మే 13 న పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే..

మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు తరలి వచ్చారు. అలానే పై చదువుల కోసం ఎందరో విద్యార్థులు భాగ్యనగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో.. ఏపీకి చెందిన వారు వేల మంది ఉన్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునే వారు, కూలీ పనులు చేసుకునే వారు ఇలా అన్ని వర్గాలు ఉన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో వీరంతా ఏపీకి వెళ్లినప్పుడు హైదరాబాద్‌ ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. అంత మంది ఏపీ వాసులు హైదరాబాద్‌లో ఉంటున్నారన్న మాట. పండుగల వేళ మాత్రమే కాక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం.. నగరంలోని ఏపీ వాసులు సొంత ఊరి బాట పడతారు

రానున్న ఎన్నికల​ కోసం వీరంతా ఓటేసేందుకు స్వస్థలాకు పయనం అవుతున్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీకి వెళ్లే ట్రైన్లు మెుత్తం మే 11, 12,13 తేదీల్లో రిజర్వ్ అయినట్లు తెలిసింది. అంటే చాలా మంది ముందస్తుగానే రిజర్వ్ చేసుకున్నారన్న మాట.

మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. దీనికి ముందు 11, 12 శని, ఆదివారాలు కావడంతో టికెట్ల బుకింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. రెండు రోజుల సెలవులు.. పోలింగ్‌ నాడు సెలవు వరుసగా మూడు రోజులు సెలవు లభిస్తుండటంతో.. చాలా మంది సొంతూరు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. దాంతో ట్రైన్‌లు ఫుల్లయ్యాయి. ఇంకొందరు ప్రైవేటు ట్రావెల్స్ ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌ బస్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయినా సరే విపరీతమైన రద్దీ ఉండనుంది.

ఈ క్రమంలో ఏపీ ఓటర్లకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఏపీకి అదనంగా బస్సులు నడిపించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో తొలి దశలో కనీసం 50 ప్రత్యేక బస్సుల్ని రిజర్వేషన్‌లో పెట్టాలని.. రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచాలని టీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఇక ఈ నిర్ణయం పట్ల ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనిర్ణయంతో ప్రయాణికులకు సౌకర్యంతో పాటు.. టీఎస్‌ఆర్టీసీకి లాభం కూడా కలగనుంది అంటున్నారు.

Show comments