iDreamPost
android-app
ios-app

గణేశ్ నిమజ్జనం వేళ భక్తులకు TGS RTC గుడ్ న్యూస్! ఏంటంటే..

  • Published Sep 16, 2024 | 11:11 AM Updated Updated Sep 16, 2024 | 11:11 AM

Hyderabad: నగరంలో గణేశ్ నవరాత్రులు ముగియనుండటంతో ప్రస్తుతం పలు ప్రాంతల్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రారంభమైయ్యాయి. అయితే ఈ నిమజ్జన ఉత్సవాల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీజీఆర్జీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

Hyderabad: నగరంలో గణేశ్ నవరాత్రులు ముగియనుండటంతో ప్రస్తుతం పలు ప్రాంతల్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రారంభమైయ్యాయి. అయితే ఈ నిమజ్జన ఉత్సవాల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీజీఆర్జీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 16, 2024 | 11:11 AMUpdated Sep 16, 2024 | 11:11 AM
గణేశ్ నిమజ్జనం వేళ భక్తులకు TGS RTC గుడ్ న్యూస్! ఏంటంటే..

దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే ఈ నవరాత్రులు ముగియనుండంతో ప్రస్తుతం పల్లెల దగ్గర నుంచి పట్టణ ప్రాంతల్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఇక ఈ వేడుకలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఒకొక్కటిగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం నగరంలో రేపు అనగా సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర జరుగుతున్నాయని తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఈ నిమజ్జన ఉత్సవాల వేళ భక్తులు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టీజీఆర్జీసీ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా గణేశ్ నిమజ్జనం కోసం నగరంలో భారీగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈనెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర నేపథ్యంలో టీజీఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భారీగా ప్రత్యేక బస్సులు నడపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. వినయాక నిమజ్జనోత్సవం వేళ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో డిపో నుంచి గరిష్ఠంగా 30 నుంచి కనీసం 15 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. కనుక ఈ ప్రత్యేకమైన సర్వీసులను భక్తులు వినియోగించుకొని గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. నగరంలో రేపు పలు ప్రాంతాల నుంచి గణేశ్ శోభయాత్రలు ప్రారంభం కాగా, అవన్నీ  ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ఆ నిమజ్జన కార్యక్రమాలకు నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే భక్తుల రాకపోకలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యలకు గురవ్వకుండా ఉండేందుకు టీజీఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. గణేశ్ భక్తుల గురించి దృష్టిలో పెట్టుకొని టీఆర్టీసీ చేస్తున్న ఈ ప్రత్యేక ఏర్పాట్లపై ప్రశంసిస్తున్నారు. మరీ, నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలకు టీఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.