iDreamPost
android-app
ios-app

Group-4 అభ్యర్థులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ను అందించింది. గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ను అందించింది. గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది.

Group-4 అభ్యర్థులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక ప్రకటన

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీపై దృష్టిసారింది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్1,2,3 లకు సంబంధించి పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి సబంధించిన ఫలితాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది టీఎస్పీఎస్సీ.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల కోసం తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షకు 7,62,872 మంది పేపర్-1 పరీక్షకు హాజరయ్యారు. అలాగే.. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక ప్రకటన చేసింది.

అభ్యర్థులు క‌మ్యూనిటీ, నాన్ క్రిమి లేయ‌ర్(బీసీల‌కు), పీడ‌బ్ల్యూడీ స‌ర్టిఫికెట్స్, స్ట‌డీ లేదా రెసిడెన్స్ స‌ర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి ఏడు వ‌ర‌కు), రిజ‌ర్వేష‌న్ క‌లిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేష‌న్, క్వాలిఫికేష‌న్ స‌ర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని టీఎస్‌పీఎస్సీ సూచించింది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌మ‌యంలో ఇవి తప్పనిసరి అని తెలిపింది. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌ను 1:3 నిష్ప‌త్తిలో, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌ను 1:5 నిష్ప‌త్తిలో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పిల‌వ‌నున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి