TSPSC ఛైర్మన్ రాజీనామా.. ఉద్యోగ పరీక్షలు రీ షెడ్యూల్‌.. త్వరలో కొత్త తేదీలు..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే టీఎస్సీపీఎస్సీ బోర్డు ఛైర్మన్ రాజీనామా చేశారు. అలానే పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే టీఎస్సీపీఎస్సీ బోర్డు ఛైర్మన్ రాజీనామా చేశారు. అలానే పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో.. అప్పుడు నియమించిన నామినేటేడ్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు తమ పదవులకు రాజీనామా చేయగా.. ఆదివారం రోజు 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేసింది రేవంత్ సర్కార్. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌదరరాజన్‌కు పంపించారు.

రాష్ట్రంలో టీఎస్సీసీఎస్సీ బోర్డు నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పరీక్షల నిర్వహణ సరిగా లేకపోవడం.. పేపర్ లీకేజీ, గ్రూప్ 1 పరీక్షను పలు సార్లు క్యాన్సిల్ చేయడం వంటి పరిణామాల వల్ల బోర్డు తీరుపై పూర్తి స్థాయిలో అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్ ఓటమిలో టీఎస్సీపీఎస్సీ బోర్డు కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బోర్డు తీరు, ప్రభుత్వ చర్యలపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని.. అది ఫలితాలపై ప్రభావం చూపింది.

ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని.. బోర్డునే మార్చేయాలని డిమాండ్ చేసిన సందర్బాలున్నాయి. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సర్కార్ ఏర్పాటు చేసిన సందర్భంలో.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉంది.

మరోవైపు.. ఉద్యోగాల భర్తిపై రెండు రోజుల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటి వరకు జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎంవో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈలోపే జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం.. దానిని గవర్నర్‌ ఆమోదించడం.. సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బోర్డులో ఉన్న మిగతా సభ్యులు కూడా నేడు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం.

అంతేకాక టీఎస్సీపీఎస్సీ బోర్డు పూర్తి స్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. టీఎస్‌పీఎస్పీ పరీక్షలన్నింటినీ రీ షెడ్యూల్‌ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం రిక్రూట్‌మెంట్‌ జరుగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్పీ విడుదల చేయనున్నట్టు కూడా సమాచారం అందుతోంది.

అంతేకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. కోదండరామ్‌ తో భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్‌ చేసే అవకాశం ఉంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3లను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Show comments