P Krishna
TS TET 2024: త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది.
TS TET 2024: త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 లకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ప్రారంభించారు. ఇక నిరుద్యోగుల విషయంలో సానుకూలత చూపిస్తున్నారు. గత నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు తేదీ విషయంలో స్పందించి ఏప్రీల్ 10 నుంచి 20వ తేదీకి పొడిగించారు. తాజాగా తెలంగాణలో భట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టెట్ నిర్వహణ విషయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలకు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. పోలింగ్ రోజు పరీక్ష నిర్వహించడం కష్టమైన పని అని.. అందుకే టెట్ ఎగ్జామ్స్ ని మరో తేదీకి వాయిదా వేయాలని తాజాగా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి సీఈఓ లేటర్ రాశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రభావం టెట్ పై పడింది. ఈ క్రమంలోనే టెట్ పరీక్ష తేదీలను విద్యాశాఖ మరోసారి పొడిగించింది.
మే 25,26,27 తేదీలో టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు ఉండవని విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. టెట్ అభ్యర్థులు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపింది. వాయిదా పడ్డ టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ వరకు తెలంగాణ టెట్ – 24 ఎగ్జామ్స్ ఆన్ లైన్ లో కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్దతిలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొన్నటి వరకు టెట్ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటీ? ఎం నిర్ణయం తీసుకుంటారన్న సందిగ్ధ ఉండేది.. ఇప్పుడు విద్యాశాఖ టెట్ ఎగ్జామ్స్ పై పూర్తి స్పష్టతనిచ్చింది.