తెలంగాణ: వచ్చే నెల నుంచే ఫ్రీ కరెంట్, 500లకే గ్యాస్, 4 వేల పెన్షన్

Gas Cylinder For Rs 500: ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యచరణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరులోగా మరో మూడు హామీలు అలు చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

Gas Cylinder For Rs 500: ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యచరణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరులోగా మరో మూడు హామీలు అలు చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అంతేకాక అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని వెల్లడించింది. అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ఆరు గ్యారెంటీల అమలు ఫైల్ మీద సంతకం పెట్టారు. ఆ వెంటనే డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలానే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం రేవంత్. అంతేకాక అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యచరణ వేగవంతం చేశారు.

రేపు అనగా జనవరి 7, ఆదివారం నాటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తవుతుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలకు కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్. వచ్చే నెల అనగా ఫిబ్రవరి చివరి నాటికి ఆరు గ్యారెంటీల్లో మరి కొన్నింటిని అమలు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, అలానే మహాలక్ష్మి పథకంలో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు.. పించన్లను 4 వేల రూపాయలకు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలాఖరున లోక్ సభ ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది. ఆలోపే ఈ మూడు పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది.

రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఈ పథకాల అమలుకు సంబంధించి.. అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ రాకముందే వీటిని అమలు చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారని.. విధివిధానాలకు సంబంధించి సూచనలు జారీ చేశారని.. అలానే పథకాల అమలుకు ఎంత ఖర్చువుతుందనే లెక్కలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారని తెలుస్తోంది. ఇప్పటికే పింఛన్ స్కీమ్ కు సంబంధించి నిర్ధిష్టమైన మార్గదర్శకాలు ఉన్నందును.. చిన్న చిన్న సవరణలు చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాక.. ఈ మూడు పథకాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే దాని గురించి అధికారులు లెక్కలు వేసి.. ప్రభుత్వానికి సమర్పించారని వార్తలు వస్తున్నాయి

ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం కింద ఆరు గ్యారెంటీలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. నేటితో ప్రజాపాలన కార్యక్రమం ముగియనుంది. ఆ తర్వాత అధికారులు లబ్ధిదారలు డేటాను సేవ్ చేస్తారు. ఆ తర్వాతనే అప్లై చేసుకున్న వారిలో ఎవరు.. ఏఏ పథకాలకు అర్హులవుతారు అనేది తెలియనుంది. వాటితో పాటే ఈ పథకాలకు ఎంత ఖర్చువతుందనే దాని గురించి ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది అంటున్నారు.

అదలా ఉంచితే.. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపే వీలైనన్ని ఎక్కువ పథకాలు అమలు చేసి.. వాటిని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుని.. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఫిబ్రవరి చివరి నాటికి.. ఈ మూడు పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Show comments