Dharani
తెలంగాణ నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు నిరుద్యోగులు కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌సీఎస్‌సీ బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజ్‌లు వంటి అంశాల వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారిని ఎక్కువగా బాధించింది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని దారుణంగా ఓడించారు. ఇక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం కూడా వారిని ఆకర్షించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి పట్టం కట్టారు.
ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. అందుకే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ప్రక్షాళన ప్రారంభించారు. తాజాగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని.. బోర్డు చైర్మన్‌గా నియమించారు.. త్వరలోనే మిగతా సభ్యులను నియామకం చేస్తామని ప్రకటించింది. ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతామని ప్రకటించారు. ఆ వివరాలు..
సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తలు వినిపించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలానే గ్రూప్-1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. అంతేకాక త్వరలోనే మరో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యిందన్నారు రేవంత్ రెడ్డి. ఇక గతంలో గ్రూప్-1 మకు సంబంధించి 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులను చేర్చినట్టు తెలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది అన్నారు సీఎం రేవంత్.
వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు. కాగా.. పేపర్ లీకేజీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు సార్లు ఈ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే గ్రూప్-4 ఫలితాలను కూడా విడుల చేసింది ప్రభుత్వం.