iDreamPost
android-app
ios-app

రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

  • Published Dec 12, 2023 | 8:19 AM Updated Updated Dec 12, 2023 | 8:39 AM

రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ వివరాలు..

రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 8:19 AMUpdated Dec 12, 2023 | 8:39 AM
రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండు సార్లు ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దీన్ని ప్రారంభించగా.. తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాన్ని కొనసాగించడమే కాక.. మరింత పెంచుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏటా జూన్, నవంబర్లో.. రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేస్తారు. అయితే ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. ఈ ఏడాది నవంబర్ లో రైతు బంధు నిధులు ఖాతాల్లో జమ అవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

ఇప్పటికే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో.. మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించే మొత్తాన్ని.. వెంటనే విడుదల చేయాలని.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు.. యాసంగి పొలం పనులు ప్రారంభించడంతో.. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా.. అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

money in farmers account

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించిన విధివిధానలు రూపొందించలేదు. దాంతో పెట్టుబడి సాయం చెల్లింపు ఆలస్యం అవుతోంది. అంతేకాక రైతుబంధు మాదిరిగానే.. ఎకరాకు 5వేలు వేస్తారా.. లేదంటే కాంగ్రెస్ ప్రకటించినట్లు.. ఎకారాకు 15 వేల సాయం కింద..  7,500 రూపాయలు జమ చేస్తారా అన్నది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అయితే రైతు భరోసా విధివిధానాలు ఇంకా రూపొందించలేదు కనుక.. ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు  ఎకరాకు 5వేల మాత్రమే అకౌంట్ లో వేయాలని రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి రైతుబంధు నిధుల విడుదలను ప్రారంభించారు అధికారులు . ఫలితంగా 70 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల మేరకు చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

అయితే.. రైతు బంధు విడుదలపై డిసెంబర్ 9 వ తేదీ నుంచే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9 తేదీనే రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో వేస్తానని మాట ఇచ్చారని.. కానీ ఇప్పటికి కూడా పెట్టుబడి సాయం అందిచంలేదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతలు ఈ విమర్శలను తిప్పి కొట్టారు. ఇక తాజాగా పెట్టుబడి సాయం మీద ఓ నిర్ణయం తీసుకోవటంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.