iDreamPost
android-app
ios-app

రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. లక్ష రూపాయలు, తులం బంగారం నిధులు విడుదల

  • Published May 19, 2024 | 11:05 AMUpdated May 19, 2024 | 11:05 AM

TS Govt: రేవంత్‌ సర్కార్‌ మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి లక్ష రూపాయలు, తులం బంగారానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.

TS Govt: రేవంత్‌ సర్కార్‌ మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి లక్ష రూపాయలు, తులం బంగారానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.

  • Published May 19, 2024 | 11:05 AMUpdated May 19, 2024 | 11:05 AM
రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. లక్ష రూపాయలు, తులం బంగారం నిధులు విడుదల

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత కరెంట్‌, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను నెరవేర్చారు. మరి కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో వాటికి బ్రేక్‌ పడింది. ఇక ఫలితాలు వెలువడిన వెంటనే.. మిగితా హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఆయా పథకాల అమలుకు నిధులను కూడా సేకరిస్తోంది. ఈక్రమంలో మరో ముఖ్యమైన పథకం అమలుకు రెడీ అవుతోంది రేవంత్‌ సర్కార్‌. దీనిలో భాగంగా రూ.లక్ష నగదు, తులం బంగారం ఇవ్వనుంది.

రేవంత్‌ ప్రకటించిన ముఖ్యమైన పథకాల్లో ఒకటి కళ్యాణలక్ష్మి. త్వరలోనే ఈ స్కీమ్‌ అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కృషి చేస్తోంది. ఈ పథకం కింద వివాహం చేసుకునే పేదింటి యువతులకు లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇవ్వనుంది. దీనికి సంబంధించి నిధులు విడుదల చేసింది సర్కార్‌. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.725 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.

ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే అనగానే లోక్‌సభ ఎలక్షన్‌ ఫలితాలు విడుదలైన వెంటనే.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు.. తులం బంగారం కూడా ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకే నిధులు కూడా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా.. లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు.. ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ఈ మేరకే ఇప్పుడు నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

కళ్యాణ లక్ష్మీ పథకం అమలు కోసం.. రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు ఈ పథకాన్ని అమలు చేయట్లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పథకాన్ని అమలు చేయటాన్ని సవాలుగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు నిధులు విడుదల చేసినట్టు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి