Dharani
తెలంగాణలో దసరా పండుగ అంటే మాములుగా ఉండదు. బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో ధూంధాం చేస్తారు జనాలు. మరో మూడు రోజుల్లో పండుగ ఉండగా.. కొందరికి మాత్రం 3 రోజుల ముందుగానే పండగ వచ్చింది. ఎలా అంటే..
తెలంగాణలో దసరా పండుగ అంటే మాములుగా ఉండదు. బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో ధూంధాం చేస్తారు జనాలు. మరో మూడు రోజుల్లో పండుగ ఉండగా.. కొందరికి మాత్రం 3 రోజుల ముందుగానే పండగ వచ్చింది. ఎలా అంటే..
Dharani
ఈ ఏడాది తెలంగాణలో దసరా పండుగ నిరుడు లెక్క ఉండదు. ఈ సారి పండగ సంబరం అంతా రాజకీయ నేతల చుట్టూనే తిరిగుతుంది. కారణం.. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ సారి ఓట్ల పండుగ.. దసరా కలిసి రావడంతో పండగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల ప్రచారంతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతుంటే.. మరోవైపు బతుకమ్మ, దసరా సంబురాలతో ప్రజలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణంగా కొందరు ఉద్యోగులకు మూడు రోజుల ముందే పండగ వచ్చింది. ఇంతకు ఎవరా ఉద్యోగులు.. ఏంటా గుడ్ న్యూస్ అంటే..
పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తాయి. అయితే తెలంగాణలోనే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా.. పండగ వేళ్ల భారీ మొత్తంలో బోనస్ అందుకునే ఉద్యోగులు ఎవరంటే.. సింగరేణి ఎంప్లాయిస్. ప్రతి ఏటా దసరా సందర్భంగా వారికి భారీ మొత్తంలో బోనస్ ప్రకటిస్తుండగా.. ఈ ఏడాది కూడా అదే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. దీంతో.. ఒక్కో కార్మికుని అకౌంట్‌లో రూ.1.53 లక్షలు జమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి కార్మికుల ఉత్సాహం రెట్టింపయ్యింది. మూడు రోజుల ముందే వారి కుటుంబాల్లో దసరా సంబురాలు మొదలయ్యాయి.
అయితే… గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగానే.. ఈ ఆర్థిక సంవత్సరం అనగా.. 2022-23 సంవత్సరంలో.. సంస్థ ఆర్జించిన లాభాల్లో 32 శాతం వాటాను సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్‌గా అందించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. మరో ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు ముందే ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ కావడంతో కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.