Dharani
ఉద్యోగుల పని వేళల కుదిస్తూ.. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
ఉద్యోగుల పని వేళల కుదిస్తూ.. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా మెచ్చేలా పాలన సాగిస్తుంది. కుల, మత తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సెంటిమెంట్లకు సమ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి పని వేళలు కుదింపు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏ ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది అంటే..
తెలంగాణ ముస్లిం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి పని వేళలు కుదింపు చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకోవడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో ఒక గంట సమయం వెసులుబాటు కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి వచ్చే నెల అనగా ఏప్రిల్ 11 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 12 నుంచి ఇది అమల్లోకి రానుంది.
మరోవైపు హజ్‌హౌజ్ మసీదులో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ బుధవారం పరిశీలించారు. ప్రార్థనలకు, ఇఫ్తార్ విందుకు ఇబ్బందులు తలెత్తకుండా.. ముంద జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే రంజాన్ పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో రంజాన్ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మసీదుల దగ్గర షామియానాలు, నీటి వసతి, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న మొదటి రంజాన్ కావడంతో.. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.
మసీదులు, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అదనంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఉంచడంతో పాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు శానిటేషన్ టీమ్స్‌ని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. షాపులు 24 గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలని.. పుట్ పాత్‌లపై ఉండే చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ పోలీస్ అధికారులతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. రంజాన్ పండుగ నిధుల విడుదలపై సీఎంతో చర్చిస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.