iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: రూ.2 లక్షల రుణమాఫీ.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన

  • Published Feb 13, 2024 | 10:10 AM Updated Updated Feb 13, 2024 | 10:10 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Feb 13, 2024 | 10:10 AMUpdated Feb 13, 2024 | 10:10 AM
Rythu Runa Mafi: రూ.2 లక్షల రుణమాఫీ.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి సహా.. కాంగ్రెస్‌ మంత్రులందరూ ప్రకటించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోన్న సర్కార్‌.. త్వరలోనే మిగతా వాటిని పూర్తి చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలకు భారీ ఎత్తున నిధులు కేటాయించింది రేవంత్‌ సర్కార్‌. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైంది 2 లక్షల రూపాయల రుణమాఫీ. దీనికి సంబంధించి తాజాగా రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీ అన్నింటి కంటే ముఖ్యమైంది. ఈ హామీ అమలు కోసం రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన బడ్జెట్‌ ప్రసంగంలో.. రైతు రుణమాఫీకి సంబంధించి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ పథకం అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

తాజాగా.. ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. గతం ప్రభుత్వం మాదిరి విడతలవారిగా కాకుండా.. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీకి  తమ సర్కార్‌ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం రాగానే.. 2 లక్షల రైతు రుణమాఫీ హామీ కార్యరూపం దాల్చుతుందని వెల్లడించారు.

రైతు బంధుకు సంబంధించి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హులకు మాత్రమే రైతుబంధు అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలానే ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్‌ రూ.500 ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రూ.2060 కాగా.. కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ఇస్తున్నారన్నారు. అందుకే బోనస్‌ గురించి ప్రస్తావించలేదని తెలిపారు.