iDreamPost
android-app
ios-app

Gaddar: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలం

  • Published Jan 31, 2024 | 1:32 PM Updated Updated Jan 31, 2024 | 1:32 PM

ప్రజా గాయకుడు గద్దర్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ప్రజా గాయకుడు గద్దర్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 1:32 PMUpdated Jan 31, 2024 | 1:32 PM
Gaddar: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఉద్యమ వీరులను, ప్రజా కళాకారులను ప్రత్యేకంగా గౌరవిస్తోన్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉద్యమకారులకు ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా యుద్ధనౌకగా ప్రసిద్ది చెందిన గాయకుడు గద్దర్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. నేడు అనగా జనవరి 31 ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అలానే ప్రతి ఏడాది ఇదే తారీఖున గద్దర్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక నేడు రవీంద్ర భారతిలో గద్దర్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆ వివరాలు..

ప్రజా యుద్ధ నౌక, దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌ జయంతి వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది అధికారికంగా గద్దర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతేకాక గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం మండలం తెల్లాపూర్‌లో 1076.4 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గద్దర్‌ విగ్రమం ఏర్పాటు కోసం ఇటీవల తెల్లాపూర్‌ పురపాలక సంఘం చేసిన తీర్మానాన్ని తాజాగా హెచ్‌ఎండీఏ ఆమోదించింది.

Gaddar idol set up

ఇక గద్దర్‌ జయంతి వేడుక నిర్వహణకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రతి ఏడాది జనవరి 31న అధికారికంగా గద్దర్‌ జయంతిని నిర్వహించాలని లేఖలో కోరారు. తెలంగాణ సాంస్కృతిక సమాజానికి గద్దర్‌ విశేషమైన సేవలిందించారని తెలిపారు. సాహిత్యం, సామాజిక న్యాయం, అణగారిని వర్గాల కోసం నిరంతరం కొట్లాడారు అని గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్‌.

‘జనవరి 31న గద్దర్‌ జయంతి వస్తుంది. గద్దర్‌ వారసత్వాన్ని గౌరవించడానికి, ప్రస్తుత తరాలకు ఆయన విలువలను తెలిపి.. వారు ఆ మార్గంలో పయనించడానికి గాను.. గద్దర్‌ జయంతిని రాష్ట​ కార్యక్రమంగా జరుపుకోవడానికి అన్ని విధాల అర్హమైంది’ అని తెలిపారు పొన్నం. ఈ లేఖపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచే అధికారికంగా గద్దర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి రెడీ అవుతోంది. మరి గద్దర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.