iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకును అందించింది. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. కాగా ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది ప్రభుత్వం. అక్టోబర్‌ వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నది. అలాగే, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది డీఏలను సైతం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన ఉన్న 4.8 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్టోబర్‌ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తూ సంస్థ పురోగతిలో తోడ్పడుతున్నారని తెలిపారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలమని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 9 డీఏలను మంజూరు చేశామని, తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని సజ్జనార్‌ వివరించారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.