iDreamPost
android-app
ios-app

సర్కార్‌ సంచలన నిర్ణయం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూర?

  • Published Jul 19, 2023 | 2:11 PM Updated Updated Jul 19, 2023 | 2:11 PM
  • Published Jul 19, 2023 | 2:11 PMUpdated Jul 19, 2023 | 2:11 PM
సర్కార్‌ సంచలన నిర్ణయం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూర?

ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ సంఖ్య తగ్గించడం.. అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం చాలా బాగా అమలువుతోంది. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి పౌష్టికాహారం అందించేలా మెనూ తయారుచేశారు. ఆకు కూరలు, గుడ్లు, కూరగాయలు వంటి పౌష్టిక పదార్థాలు అన్ని భోజనంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదవి విద్యార్థులకు రాగి జావా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుండనున్నట్లు సమాచారం. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూర పెట్టనున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..

విద్యార్థుల కోసం తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారు.. వారికి ఒక్కొక్కరికి ఎన్ని గ్రాముల చేపలు అవసరం.. పిల్లలందరికీ కలిపి ఎంత మొత్తంలో చేపలు అవసరం అవుతాయి.. వారానికి ఎన్ని రోజులు చేపల కూడా వడ్డించాలి.. ఇందుకు నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై అధికారులు లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఈ కసరత్తు పూర్తి కాగానే దీని గురించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అనంతరం ప్రభత్వం నిర్ణయం ప్రకారమే విద్యార్థుల భోజనం మెనులో చేపల కూరను చేర్చనున్నట్లు తెలుస్తోంది. .