iDreamPost

రేపు సెలవు ఇవ్వలేదా? మీ HR కి ఈ లెటర్ చూపించండి!

  • Published Nov 29, 2023 | 10:18 AMUpdated Nov 29, 2023 | 10:36 AM

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఒకవేళ ఏదైనా కంపెనీ పోలింగ్ నాడు హాలిడే ఇవ్వకపోతే.. హెచ్ఆర్ కి ఒక లెటర్ చూపించని తెలిపారు ఈసీ అధికారులు. ఆ వివరాలు..

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఒకవేళ ఏదైనా కంపెనీ పోలింగ్ నాడు హాలిడే ఇవ్వకపోతే.. హెచ్ఆర్ కి ఒక లెటర్ చూపించని తెలిపారు ఈసీ అధికారులు. ఆ వివరాలు..

  • Published Nov 29, 2023 | 10:18 AMUpdated Nov 29, 2023 | 10:36 AM
రేపు సెలవు ఇవ్వలేదా? మీ HR కి ఈ లెటర్ చూపించండి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వ సిద్ధం అయ్యింది. రేపు అనగా నవంబర్ 30, గురువారం నాడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈసారి ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పని చేసింది. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు గాను.. విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది.

పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందేనని తెలిపింది. ఎవరైనా పోలింగ్ నాడు హాలీడే ఇవ్వకపోతే.. ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సదరు కంపెనీ హెచ్ఆర్ కి చూపించాలని అధికారులు తెలిపారు. అప్పటికి కూడా సెలవు మంజూరు చేయకపోతే.. సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి డిసెంబర్ 1న కూడా హాలీడే ఇచ్చారు.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి. అధికారం కోసం పార్టీలన్ని తీవ్రంగా శ్రమించాయి. మరి ఓటరు మదిలో ఏం ఉందో.. ఎవరికి పట్టం కడతాడో.. ఎవరిని పక్కకు పెడతాడో తెలియాలంటే.. మరో నాలుగు రోజులు ఎదురు చూడక తప్పదు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్స్, బార్లు మూసివేశారు. కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇక తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ సరిహద్దుల్లో 148 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది. ఇక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులు ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీల నినాదంతో ప్రచారంలో దూసుకుపోయింది. అలానే కాషాయ పార్టీ బీజేపీ సైతం బీసీ ముఖ్యమంత్రి నినాదంతో.. ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంకలు ప్రచారం చేయగా.. బీజేపీ తరఫున మోదీ, అమిత్ షాలు రంగంలోకి దిగారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి