SNP
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు ఆగిపోయాయి.. దీనికి సంబంధించి తాజాగా ఈసీ కీలక ప్రటకన చేసింది. ఆ వివరాలు..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు ఆగిపోయాయి.. దీనికి సంబంధించి తాజాగా ఈసీ కీలక ప్రటకన చేసింది. ఆ వివరాలు..
SNP
తెలంగాణలో మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ప్రస్తుతం పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఎలక్షన్ క్యాపెయిన్ ముగియనుంది. ఇక ఎన్నికల నగరా మోగిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దాంతో కొన్ని ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయి. వాటిల్లో రైతుబంధు ఒకటి. అన్నదాతలకు పెట్టుబటి సాయం అందించడం కోసం ప్రతి ఏటా.. రెండు దఫాలుగా అంటే జూన్, నవంబర్‌లో ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌లో విడుదల కావాల్సిన రైతుబంధు నిధులు ఆగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది.
రైతుబంధు నిధులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి ఇది బిగ్ బూస్ట్ లాంటి నిర్ణయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే కేసీఆర్ సర్కార్.. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఖాతాల్లోకి వెంటనే నగదు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం వరకే సంబంధిత బ్యాంకులకు సైతం ఉత్తర్వులు వెళ్లినట్లు తెలుస్తోంది.
రైతుబంధు నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి చిన్న చిక్కొచ్చి పడింది. నవంబర్ 28 వరకే నగదు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల సమయం ఉంది కదా అనుకోవచ్చు. కానీ నేడు, రేపు బ్యాంకులకు సెలవు (నాలుగో శనివారం, ఆదివారం). సోమవారం కూడా కొన్ని బ్యాంకులకు ఆప్షనల్ హాలీడే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రైతు బంధు నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం వద్ద కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడమంటే అంత తేలికైన వ్యవహారమేమీ కాదు అంటున్నారు అధికారులు.
రైతుబంధు నిధుల్లో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దాంతో నిధులు విడుదల ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో రైతుబంధు నగదు బదిలీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరికి రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇస్తూ శుక్రవారం (నవంబర్ 24) ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 71.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.ఈ పథకం కింద రూ.7700 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో విడుతలవారీగా ప్రభుత్వం జమ చేయనుంది