iDreamPost
android-app
ios-app

TS Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విక్టరీ.. షాకింగ్ ట్వీట్ చేసిన హీరో నిఖిల్!

  • Author singhj Published - 06:22 PM, Sun - 3 December 23

తెలంగాణ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీ నాయకులకు కంగ్రాట్స్ చెబుతూ సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

తెలంగాణ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీ నాయకులకు కంగ్రాట్స్ చెబుతూ సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

  • Author singhj Published - 06:22 PM, Sun - 3 December 23
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విక్టరీ.. షాకింగ్ ట్వీట్ చేసిన హీరో నిఖిల్!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ సాధించిన ఆ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన హస్తం పార్టీ.. డిసెంబర్ 4వ తేదీన లేదా డిసెంబర్ 9వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎలక్షన్స్​లో ఓటమితో గవర్నర్​కు తన రాజీనామా లేఖను పంపారు కేసీఆర్. నేరుగా కాకుండా ఓఎస్డీతో రిజిగ్నేషన్ లెటర్​ను రాజ్​భవన్​కు పంపించారు. రేపు సీఎల్పీ సమావేశం జరిపి అందులో సీఎం క్యాండిడేట్​ను కాంగ్రెస్ నేతలు ఎంచుకుంటారని వినిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్లు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో ఒకర్ని సీఎంను చేస్తారా? లేదా సీనియర్లలో ఇంకెవరైనా ఈ రేసులోకి వస్తారా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్​ను కాంగ్రెస్ పార్టీ దాటేసింది. దీంతో రంగాలకు అతీతంగా ప్రముఖులు, సెలబ్రిటీలు హస్తం పార్టీని, ఆ పార్టీ నేతలకు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ మీద ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయనో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్​లో రేవంత్ రెడ్డికి స్పెషల్​గా విషెస్ తెలిపారాయన. రేవంత్​తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను షేర్ చేసిన నిఖిల్.. ‘తెలంగాణలో అద్భుత విజయం సాధించిన రేవంత్ అన్నకు శుభాకాంక్షలు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు. ప్రజాస్వామ్యం బతికే ఉంది’ అని నిఖిల్ ట్వీట్ చేశారు.

నిఖిల్ కంటే ముందు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంగ్రెస్ విక్టరీపై తనదైన శైలిలో స్పందించారు. ‘హాయ్ రాహుల్ జీ, సోనియా జీ.. చాలా ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ మీద రెస్పెక్ట్ కలిగింది. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సత్తా చాటారు. కొడంగల్​లో రేవంత్ రెడ్డి గెలుపు బావుటా ఎగరేశారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో భట్టి విక్రమార్క, నాగార్జున సాగర్​లో మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరి.. కాంగ్రెస్, బీజేపీని అభినందిస్తూ నిఖిల్ ట్వీట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BRSని ఓడించిన దళితబంధు! 10 లక్షలు ఇచ్చినా ప్రయోజనం లేదు!

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş