iDreamPost

BRSని ఓడించిన దళితబంధు! 10 లక్షలు ఇచ్చినా ప్రయోజనం లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దళిత బంధు పథకం కూడా ఓ కారణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దళిత బంధు పథకం కూడా ఓ కారణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

BRSని ఓడించిన దళితబంధు! 10 లక్షలు ఇచ్చినా ప్రయోజనం లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు దాదాపు అన్ని చోట్ల విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆనాటి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు అనేక సందర్భాల్లో వివరించారు. ఇకపోతే, ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. ఇక ఎస్టీ కేటగిరి విషయానికొస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ములుగు స్థానం నుంచి సీతక్క విజయం సాధించి రెండవ సారి గెలుపొందారు. ఇక్కడే కాకుండా మహబూబాబాద్ లో మురళీ నాయక్, పీనపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, దేవరకొండలో నేనావత్ బాలు నాయక్ వంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమీప ప్రత్యర్థులపై విజయ ఢంకా మోగించారు.

ఇక ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలను చూస్తే.. మధరిలో భట్టి విక్రమార్క, చెన్నూరులో వివేక్ వెంకట స్వామి, ఇల్లందులో-కోరం కనకయ్య, అచ్చంపేటలో చిక్కుడు వంశీ కృష్ణ వంటి అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలుస్తొంది. ఇదిల ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పథకం దళిత బంధు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలని అనుకుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం కొన్ని దళిత కుటుంబాలకు రూ.10 ఆర్థిక సాయం అందించింది. అయితే, ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక లీడర్లు తమ వెంట తిరిగిన కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

దీంతో మిగతా దళిత కుటుంబాలకు ఈ పథకం అందించకపోవడంతో ప్రభుత్వంపై దళితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ కారణంతోనే తెలంగాణలో పోటీ చేసిన ఎస్టీ, ఎస్టీ రిజ్వర్వ్ డ్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై దళితుల్లో వ్యతిరేకత రావడానికి దళిత బంధు పథకం ఓ కారణంగా చెప్పవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎస్టీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లోనే కాకుండా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి