Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. హస్తం పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి అని చెప్పవచ్చు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలుకై చర్యలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే వీటిల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో.. ఆరు గ్యారెంటీలను కచ్చింతగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా సొంత ఇంటి స్థలం ఉన్న వారికి.. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సొంత ఇంటి జాగా లేని వారికీ ముందుగా పట్టాలు పంపిణీ చేసి.. ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇళ్ల జాగా లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలంటే.. ముందుగా భూమి సేకరించాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ముందుగా ఇంటి స్థలం ఉన్న వారికి.. ఇళ్ల నిర్మాణినికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం అర్హులైన పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలానే జాగా లేని వారికి స్థలం పట్టాలు ఇచ్చి.. ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా సొంతంగా స్థలం ఉన్న పేదలకు.. ఒక్కో ఇంటి కోసం 5 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి.. వారు వెంటనే ఇళ్ల నిర్మాణ చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి.. వారికి ముందుగా ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత వారు అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు గాను 5 లక్షల రూపాయల నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్ల జాగా పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ప్రకటించిన సంగతి తెలసిందే. ఇక త్వరలోనే వారికి ప్లాట్లు ఇవ్వడం మాత్రమే కాక.. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.