iDreamPost
android-app
ios-app

CM Revanth Reddy: CM రేవంత్ ‘ఎక్స్’ అకౌంట్ బ్లూటిక్ మాయం.. అసలేం జరిగింది

  • Published Apr 11, 2024 | 11:38 AM Updated Updated Apr 11, 2024 | 11:38 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ (ఎక్స్) ఖాతా బ్లూ టిక్ మాయం కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ (ఎక్స్) ఖాతా బ్లూ టిక్ మాయం కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

  • Published Apr 11, 2024 | 11:38 AMUpdated Apr 11, 2024 | 11:38 AM
CM Revanth Reddy: CM రేవంత్ ‘ఎక్స్’ అకౌంట్ బ్లూటిక్ మాయం.. అసలేం జరిగింది

ఎలన్ మస్క్ చేతికి వచ్చాక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా బ్లూ టిక్ విషయంలో. ఒకప్పుడు వెరిఫైడ్ అకౌంట్స్ కి మాత్రమే బ్లూ టిక్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. దాంతో ఇప్పుడు ఎవరిది ఫేక్ అకౌంటో.. ఎవరిది రియల్ ఖాతానో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతా బ్లూ టిక్ ను కోల్పోయారు. దాంతో నెటిజనులు, కాంగ్రెస్ కార్యకర్తలు అసలేం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు ఏం జరిగిందంటే..

సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతా బ్లూటిక్ మార్క్ ను కోల్పోయారు. దాంతో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం ఎక్స్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారా.. ఏంటి అని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్లు. అయితే హ్యాకింగ్ వల్ల ఇలా జరగలేదని.. టెక్నికల్ సమస్య వల్లే రేవంత్ ఎక్స్ ఖాతా బ్లూ టిక్ మార్క్ పోయినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి బ్లూటిక్ పోయినట్లు సీఎం సోషల్ మీడియా అకౌంట్లు చూస్తున్న టీమ్ స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్క్ తిరిగి వస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలియజేశారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడుస్తున్న ఫొటో మార్చారు. దాని వల్లే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పటికి.. సీఎం రేవంత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించారంటూ.. బీఆర్ఎస్ బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈసీకి బీఆర్ఎస్ వినతిపత్రాలు సమర్పించింది. తక్షణమే రేవంత్ ని లోక్ సభ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని, ఆయనపై, కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.