iDreamPost
android-app
ios-app

Revanth Reddy: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ.. ఎప్పటిలోపంటే

  • Published Dec 28, 2023 | 1:41 PM Updated Updated Dec 28, 2023 | 1:41 PM

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశార. ఆ వివరాలు..

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశార. ఆ వివరాలు..

  • Published Dec 28, 2023 | 1:41 PMUpdated Dec 28, 2023 | 1:41 PM
Revanth Reddy: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ.. ఎప్పటిలోపంటే

ఈఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ హయాంలో.. ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, పేపర్ లీకేజీ, క్వశ్చన్ పేపర్లును అమ్ముకోవడం, టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు, టీఎస్పీఎస్సీ బోర్డలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో.. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ ను ఓడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించించింది. ఇక దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ సచివాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 9 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టీఎస్పీఎస్సీ ద్వారా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఆలస్యం కావడానికి కారణం.. టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాల ఆమోదం పెండింగ్ లో ఉండటమే అన్నారు.

టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ లేకుండా తాము ఏం చేయలేమని.. అందుకే గ్రూప్ – 2 పరీక్ష కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులందరూ రాజీనామాలు సమర్పించారని, అవి ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఆ విషయంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత వాటిని ఆమోదిస్తారని అన్నారు. నియామకాల్లో పారదర్శకత కోసం త్వరలోనే కొత్త బోర్డును నియమిస్తామని తెలిపారు. ఈ ఆలస్యంపై నిరుద్యోగ యువత నిరుత్సాహానికి గురి కావద్దని సీఎం రేవంత్ సూచించారు.

తమ ప్రభుత్వం కచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని.. అలానే జాబ్ క్యాలెండర్ ను కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని రోజులు ఎదురు చూస్తాం కానీ.. ఈసారైన ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేయమని కోరుకుంటున్నారు.