మేడారం జాతరలో వైరల్ అయిన చెంచులక్ష్మీ అరెస్ట్!

ఈ మధ్యాకాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ ద్వారా చాలామంది ఫెమస్ అవ్వడమే కాకుండా లేనిపోని ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. తాజాగా మేడారం జాతరలో గిరిజన మహిళ ఓ యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా ఇప్పుడు జైలు పాలైంది. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మధ్యాకాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ ద్వారా చాలామంది ఫెమస్ అవ్వడమే కాకుండా లేనిపోని ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. తాజాగా మేడారం జాతరలో గిరిజన మహిళ ఓ యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా ఇప్పుడు జైలు పాలైంది. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మధ్యాకాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ప్రతిఒక్కరూ తమ ప్రతిభను బయట పెట్టేందుకు విశ్వ ప్రయాత్నలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటు సెటబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం అందరూ రకరకాల వీడియోలు చేస్తు డబ్బులను సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం రాక, ఉపాధి లేని వ్యక్తులు తమ సొంత కాళ్ల పై నిలబడాలని, సొంతగా యూట్యూబ్ ఛానెల్ ను నడపుతూ.. కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే విభన్న మనుషులను ఇంటర్వ్యూలు  చేస్తుంటారు. ఇలా చేయడం వలన వీరికి వ్యూస్ పెరగడమే కాకుండా.. అవతల వ్యక్తులు కూడా బాగా ఫేమస్ అవుతుంటారు. అయితే ఇలా ఫేమస్ అయిన వారిలో ఇటీవలే కూమరీ అంటీ కూడా ఉన్నారు. ఈమె కూడా ఈ యూట్యూబ్ ఛానెల్ వలనే బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే, వీటి వలన కొంత మేలు జరిగిన ఎక్కువ శాతం అనేక ట్రోల్స్ కు గురవుతూ లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వలన మేడారంలో గిరిజన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.అసలు ఏం జరిగిదంటే..

అడవుల్లో దొరికే మూలికలు అమ్ముతున్న ఒక గిరిజన మహిళను ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే అప్పటి నుంచి ఆమె ఇంటర్వ్యూ కూడా  తెగ వైరల్ అవ్వడంతో ఆ మహిళ కూడా బాగా ఫేమస్ అయింది. కానీ, ఇలా వైరల్ అవ్వడమే పాపం ఆ మహిళకు శాపంగా మారి.. ఇప్పుడు జైలు పాలైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. మేడారం జాతరలో ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిజన మహిళ తన దగ్గర అడవి జంతువులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది చూసిన అటవి అధికారులు వైల్డ్ యానిమాల్స్ యాక్ట్ ను ఉల్లఘించారంటూ ఆమెను అరెస్టు చేశారు. కాగా, ఫారెస్టు అధికారుల కథనం ప్రకారం.. భూపల్లి జిల్లా గణపురం మండలం చెంచు కాలానికి చెందిన.. లక్ష్మీ ప్రకృతి వైద్యం చేసేది. మేడారం జాతరలో వన మూలికల షాప్ పెట్టుకుంది. అయితే మేడారం జాతరకు వచ్చిన ఓ యూట్యూబర్ ఆమె వద్దకు వచ్చి వీడియోలు తీస్తూ.. ఏ రోగానికి ఏ మందులు ఉన్నాయని ప్రశ్నించాడు. అందుకు ఆమె అన్నిటికి సమాధానం తెలుపుతూ.. అన్నిటికి అన్ని రకాల మందులు నా దగ్గర ఉన్నాయని చెప్పింది. అంతేకాకుండా.. ఆ మహిళ అత్యుత్సహంతో తన వద్ద ముంగిస,నక్కతోక ఇతర జంతువుల గోర్లు, చర్మం మొదలగు జంతువుల అవయవాలు ఉన్నాయని తెలిపింది.

దీంతో ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో.. విషయం కాస్త ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు సోదాలను నిర్వహించి.. చెంచు కాలనీలోని ప్రకృతి వైద్యం చేసే లక్ష్మీ ఇంటిలో తనీఖి చేశారు. అక్కడ వారికి అటవి జంతువుల అవయవాలు, వస్తువులు దొరకడంతో..వాటిని సీజ్ చేసి ములుగు రెవెన్యు ఆఫీసుకి తరలించారు. అనంతరం లక్ష్మీని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇక ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ వైల్డ్ లైఫ్ అధికారులు సిబ్బందిని అభినందించారు. ఈ కేసును ఫారెస్ట్ మొబైల్ పార్టికి అప్పగించారు. ఫారెస్టు రేంజర్లు శంకర్ సీతల్,బీట్ ఆఫీసర్లు రవీనా, వసంతి, సీతారామ్ వసంత పాల్గొన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా ఇంటర్వ్యూ అనేది లక్ష్మీకి ఎంత పెద్ద చిక్కులో పడేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రకృతి వైద్యం చేస్తున్న లక్ష్మీ ని యూట్యుబ్ ఇంటర్వ్యూ ద్వారా జైలు పాలు అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments