iDreamPost
android-app
ios-app

RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ జిల్లాల నుంచి!

  • Published Jul 13, 2024 | 5:41 PM Updated Updated Jul 13, 2024 | 5:41 PM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ  ప్రయాణికుల రద్దీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల  సౌకర్యార్థం కోసం ఇప్పటికే అధికారులు అదనంగా బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే బస్సుల్లో ప్రయాణికుల ఇబ్బందులు రాను రాను ఎక్కువైవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ  ప్రయాణికుల రద్దీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల  సౌకర్యార్థం కోసం ఇప్పటికే అధికారులు అదనంగా బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే బస్సుల్లో ప్రయాణికుల ఇబ్బందులు రాను రాను ఎక్కువైవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు.

  • Published Jul 13, 2024 | 5:41 PMUpdated Jul 13, 2024 | 5:41 PM
RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ జిల్లాల నుంచి!

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికరంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఫ్రీ బస్సు సదుపాయం కావడంతో.. రోజు రోజుకి బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో బస్సులో విపరీతమైన రద్దీగా పెరిగిపోయింది. కాగా, ఇప్పటికే గతంలో రోజుకు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వారి సంఖ్య 30 లక్షలకు చేరుకుంది.దీంతో కనీసం కాలు కదిపే అవకాశం స్థలం కూడా ఉండటం లేదు.ఇక సిటీ బస్సుల్లో పరిస్థితి కూడా అంతకన్నా దారుణంగా ఉంది. కనీసం టికెట్ కొనుక్కున్న సీటు దొరకడం లేదు. ఈ సమస్యలనే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాజాగా కొన్ని ఆర్టీసీ బస్సులను తీసుకురావాలని ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ  ప్రయాణికుల రద్దీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల  సౌకర్యార్థం కోసం ఇప్పటికే అధికారులు అదనంగా బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే బస్సుల్లో ప్రయాణికుల ఇబ్బందులు రాను రాను ఎక్కువైవుతున్నాయి. కనీసం బస్సుల్లో నిల్చొనే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో ప్రజల కోసం కొత్తగా 1000 బస్సులు కొనుగోలు చేశామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చిమని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈమేరకు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కొత్త బస్సు సర్వీసులను కూడా ప్రారంభించారు. అలాగే నల్గొండ-హైదరాబాద్‌ మధ్య నాన్‌స్టాప్‌ ఏసీ, 3 డీలక్స్‌ బస్సులను మంత్రులు ప్రారంభించారు.

ఇక దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్‌, 30 లగ్జరీ బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా..  ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర జిల్లాలకు సైతం ఏసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల గురించి కూడా కీలక ప్రకటన చేశారు. వారికి ఇప్పటికే 21 శాతం డీఏ ఇచ్చామని వెల్లడించారు. అయితే ఇప్పటికే  రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. ఇక మిగిలిన రూ.200 కోట్లను జులై నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టామని త్వరలోనే వాటి భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఇక ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాలకు లగ్జరీ బస్సులు నడిపించనున్నట్లు వెల్లడించారు. అయితే మంత్రి చెప్పిన శుభవార్త తెలియడంతో నగరంలో ప్రజలు ఆయనను ప్రశంసించారు. మరి, నగరంలో త్వరలోని అదనంగా బస్సులు అందుబాటులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.