iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ CP సంచలన నిర్ణయం..పంజాగుట్ట PSలోని 85 మంది బదిలీ!

Panjagutta Police Station: హైదరాబాద్ సిటీ కమిషన్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాని బదిలీ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు.

Panjagutta Police Station: హైదరాబాద్ సిటీ కమిషన్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాని బదిలీ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ CP సంచలన నిర్ణయం..పంజాగుట్ట PSలోని 85 మంది బదిలీ!

హైదరాబాద్ సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.  పంజాగుట్ట పీఎస్ లోని మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాస రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్  కొడుకు యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు బయటకి రావడంతో సీపీ ఆగ్రహం చెందారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటకి రావడంతో ఆగ్రహించిన సీపీ ..సీఐ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరిని మార్చేశాడు. ఒకేసారి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోని ఇదే మొదటి సారి.

తెలంగాణ పోలీస్ శాఖలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గతంలో ఎన్నోడు లేని విధంగా హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీఐ దగ్గర నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మందిని బదిలీచేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర చరిత్రలోనే ఓ పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేయడం ఇదే మొదటి సారి.

పంజాగుట్ట సిబ్బందిని సీపీ శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్యనీయాశంగా మారింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక సమాచారం బయటకు రావడంతో సీపీ ఆగ్రహించారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని టాక్. ఆ ప్రమాదం వ్యవహరంతో ఆగ్రహించిన సీపీ శ్రీనివాస రెడ్డి పంజాగుట్ట పీఎస్ మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. వీరిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు ప్రధాన కార్యాలయలంలో రిపోర్టు  చేయాలని ఆదేశించారు. పంజాగుట్ట పీఎస్ కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. మరి.. హైదరాబాద్ సీపీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.