Krishna Kowshik
వరుస రైల్వే ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ నెల 17 ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో 15 మంది మృతి చెందిన సంగతి విదితమే. తాజాగా
వరుస రైల్వే ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ నెల 17 ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో 15 మంది మృతి చెందిన సంగతి విదితమే. తాజాగా
Krishna Kowshik
వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో భయాందోళన కలుగ చేస్తున్నాయి. రైలు ప్రయాణాలు అంటే భయపడేలా చేస్తున్నాయి. గత ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ నెల 17 ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో 15 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలులో అగ్ని ప్రమాదం జరిగింది.
సికింద్రాబాద్ మెట్టుగూడలో రెండు బోగీల నుండి మంటలు వచ్చాయి. నిలిచిన బోగీల్లో ఈ మంటలు చెలరేగాయి. స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు గుర్తించిన సిబ్బంది ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. కాలిన బోగీల నుండి దట్టమైన పొగ ఆవరించింది. మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈ రైల్వే కోచ్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదనపు ఏసీ బోగీల్లో ఈ మంటలు అలముకున్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనపై రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు.ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్గం అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.