iDreamPost
android-app
ios-app

మరి కొన్ని రోజుల్లో కొత్త జీవితం..అంతలోనే తల్లిదండ్రులకు తీరని శోకం

  • Published Jul 13, 2024 | 3:02 PM Updated Updated Jul 13, 2024 | 3:02 PM

సాధరణంగా ఏ తల్లిదండ్రులైన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ అయ్యా చేతులో పెట్టి తమ బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కూతురిని ఓ తల్లిదండ్రులు పాడె ఎక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..

సాధరణంగా ఏ తల్లిదండ్రులైన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ అయ్యా చేతులో పెట్టి తమ బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కూతురిని ఓ తల్లిదండ్రులు పాడె ఎక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 13, 2024 | 3:02 PMUpdated Jul 13, 2024 | 3:02 PM
మరి కొన్ని రోజుల్లో కొత్త జీవితం..అంతలోనే తల్లిదండ్రులకు తీరని శోకం

సాధరణంగా ఏ ఆడపిల్లకైనా పెళ్లి అంటే..ఒక అందమైన కళలా ఉంటుంది. ముఖ్యంగా ఓ కొత్త వ్యక్తితో, కొత్త జీవితం ప్రయాణం కావడంతో.. కోటి ఆశలతో ఆ వివాహ తంతు కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఈ వేడుక కోసం ఆడపిల్ల ఇంట్లో తల్లిదండ్రులు కూడా చేసిన హడవిడి మాములుగా ఉండదు. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే.. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ అయ్యా చేతులో పెట్టి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కూతురిని ఓ తల్లిదండ్రులు పాడె ఎక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..

మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతికి కిడ్నీ వ్యాధి మృత్యు రూపంలో కాటు వేసింది. దీంతో తీవ్రమైన జ్వరంకు గురైన ఆ యువతిని హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో తీసుకెళ్లారు. ఇక అక్కడ చికిత్స పొందుతున్న ఆ యువతి గురువారం రాత్రి మృతి చెందింది. అయితే ఈ విషాద ఘటన రాజోలి మండలంలోని మాందొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, కుటుంబ సభ్యులు తెలిపిన  వివరాల ప్రకారం..  మాందొడ్డి గ్రామానికి చెందిన రూబిక (22) గత కొంతకాలం క్రితం  కిడ్నీ వ్యాధికి గురైంది. దీంతో ఆమె డాక్టర్లు సలహా మేరకు చికిత్స పొందుతుంది. కానీ, తాజాగా ఆ కిడ్నీ వ్యాధి, జ్వరం తీవ్రత పెరగడంతో.. ఆమెను మొదట కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు.

కానీ, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఇక అక్కడ యువతి పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతునే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మరి కొన్ని రోజుల్లో పెళ్లి పందిట్లో పెళ్లి కూతురిగా చూడవాల్సిన తమ కూతురిని ఇలా విగతజీవిగా చూడాల్సి వచ్చిందని తల్లిదండ్రులు గుండె పగిలేలా కన్నీరు పెట్టుకున్నారు. మరి, ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఇలా కీడ్ని వ్యాధి రూపంలో మృతి చెందిన ఘటనపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.