Uppula Naresh
Uppula Naresh
మహబూబ్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇటీవల వెలుగు చేసిన ఈ ఘటన స్థానికులను కంటతటి పెట్టిస్తుంది. అసలు 24 గంటల వ్యవధిలోనే తండ్రి, కూతురు ఎలా చనిపోయారు? అసలేం జరిగిందంటే?
మహబూబ్ నగర్ మండలం దుప్పల్లిలో తిరుమల్ రావు (50), కుర్మమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ల సంతానం. పెద్ద కూతురు ప్రత్యూష (20)కు ఏడాది కిందట ఇదే గ్రామానికి చెందిన బాలరాజు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తండ్రి తిరుమల్ రావు అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో దగ్గరలోని ఓ చిన్న క్లినిక్ లో చూపించారు. అప్పటి నుంచి ఇల్లు గడవడం భారంగా మారడంతో భార్య కుర్మమ్మ స్థానికంగా కూలీనాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇకపోతే.. కూతురు ప్రత్యూష 9 నెలల గర్భిణీ కావడంతో కాన్పు నిమిత్తం ఈ నెల 3న వనపర్తిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలోనే తండ్రి తిరుమల్ రావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం మృతి చెందాడు. ఒకపక్క కూతురు ఆడబిడ్డకు జన్మినిచ్చినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే మహబూబ్ నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రత్యూష శనివారం ప్రాణాలు కోల్పోయింది. 24 గంటల వ్యవధిలోనే భర్త, కూతురు మరణించడంతో భార్య కుర్మమ్మ, ఆమె ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటన స్థానికులను సైతం కంటతటి పెట్టించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఒక రోజు వ్యవధిలోనే తండ్రి, కూతురు మృతి చెందిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.