iDreamPost
android-app
ios-app

హృదయ విదారక ఘటన.. కూతురి మరణాన్ని తట్టుకోలేక తండ్రి బలవన్మరణం!

హృదయ విదారక ఘటన.. కూతురి మరణాన్ని తట్టుకోలేక తండ్రి బలవన్మరణం!

ఖైరతాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూతురి మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఓ కాలనీలో కిషోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆరాధ్య (5) అనే కూతురు ఉంది. అయితే ఈ చిన్నారి గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంది. దీంతో తండ్రి కిషోర్ కూతురిని రక్షించుకునేందుకు అనేక ఆస్పత్రుల చుట్టు తిరిగి చికిత్స చేయించాడు.

పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తండ్రి కిషోర్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆరాధ్య లేదు, ఇక తిరిగి రాదని తెలియడంతో అతడు తట్టుకోలేకపోయాడు. కూతురు లేని బతుకు ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. కిషోర్ తాజాగా ఖైరతాబాద్ రైల్వే పట్టాలపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిషోర్ మరణ వార్త తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: చనిపోయిందని అందరినీ నమ్మించారు.. పాపం, ఇది నిజమే అనుకుని..!

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş