iDreamPost
android-app
ios-app

HYD వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకండి!

  • Published Sep 16, 2024 | 10:15 AM Updated Updated Sep 16, 2024 | 10:26 AM

Hyderabad: నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ను జారీ చేశారు. ఎందుకంటే.. నగర పరిధిలో రేపు, ఎల్లుండి రెండు రోజులు గణేశ్‌ నిమజ్జన  కార్యక్రమాలు జరగనున్నాయని కనుక ఈ రూట్లలో వెళ్లకండి అంటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad: నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ను జారీ చేశారు. ఎందుకంటే.. నగర పరిధిలో రేపు, ఎల్లుండి రెండు రోజులు గణేశ్‌ నిమజ్జన  కార్యక్రమాలు జరగనున్నాయని కనుక ఈ రూట్లలో వెళ్లకండి అంటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • Published Sep 16, 2024 | 10:15 AMUpdated Sep 16, 2024 | 10:26 AM
HYD వాహనదారులకు  అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకండి!

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. కాగా, ఇప్పటికే ప్రతి వీధిలో కొలువుదీరున్న ఆ గణనాథుడు గంగమ్మ ఓడికి చేరుకుంటున్నాడు. దీంతో నగరంలో ఏ నోట చూసినా.. ఏ నోట విన్నా.. గణపతి బప్ప మోరియా అంటూ నినానదాలు మారుమోగుతున్నాయి. ఇకపోతే నగరంలో రేపు పలు ప్రాంతాల్లో కొలువుతీరున్న ఆ విఘ్నేశ్వరుడుకు నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు జరగునున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు ఆ ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ను జారీ చేశారు. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ను జారీ చేశారు. ఎందుకంటే.. నగర పరిధిలో గణేశ్‌ నిమజ్జన  కార్యక్రమాలు జరగనున్నాయని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించినట్లు తెలిపారు. ముఖ్యంగా రేపు 17,18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే నగరంలో.. బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రధాన ఊరేగింపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని, ఇది కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (లెఫ్ట్ టర్న్), MBNR ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, MJ మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ అంబేడ్కర్‌ విగ్రహం, కోఠి ఆంధ్రా బ్యాంక్ లో వైపు శోభాయాత్ర సాగుతుందని చెప్పారు. కనుక ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని పోలీసులు తెలిపారు.

ఇకపోతే బాలానగర్, ఖైరతాబాద్ గణనాథులతో పాటు వివిధ గణపతుల శోభాయాత్ర కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఆ రోజున మాసబ్ ట్యాంక్ దాటి, వీవీ స్టాచ్యూ, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, చాదర్‌ఘాట్, ఐఎస్ సదన్, వైఎంసీఏ నారాయణగూడ, తార్నాకలు దాటి ఆర్టీసీ బస్సులు రావని అధికారులు తెలిపారు. దీంతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే వారు, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దారుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అయితే బదలు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గం గుండా, ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టు చేరుకోవాలని కోరారు.  అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే వాహనాలను బేగంపేట్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.

ఈ ప్రాంతాలతో పాటు ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు చేర్చనున్నారు. వీటితో పాటు ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు చేర్చనున్నారు. ఈ రూట్లలో 7,18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని సీవీ ఆనంద్  కోరారు.