iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో 45 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!

  • Published Aug 03, 2024 | 1:23 PM Updated Updated Aug 03, 2024 | 1:30 PM

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. ఏదైనా పండగల సమయంలో, మరీ ఏ ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, మరమత్తులు జరిగినప్పుడు ముందుగానే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో నేటి నుంచి మరో 45 రోజుల పాటు ఆ ప్రాంతంలో వాహనదారుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఎక్కడంటే..

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. ఏదైనా పండగల సమయంలో, మరీ ఏ ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, మరమత్తులు జరిగినప్పుడు ముందుగానే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో నేటి నుంచి మరో 45 రోజుల పాటు ఆ ప్రాంతంలో వాహనదారుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 03, 2024 | 1:23 PMUpdated Aug 03, 2024 | 1:30 PM
హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో 45 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!

నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికీ నీడలా వెంటాడుతునే ఉంటాయి. ముఖ్యంగా మహా నగరాల్లో అయితే వాహనదారులు పడే ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే.. అడగడుగునా రద్దీ అయినా ట్రాఫిక్ తో ఆఫీసులకు, స్కూల్లకు, కాలేజీలకు వెళ్లి రావలసిన ఉద్యోగులు, విద్యార్థులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ఇక రోజు రోజుకి ఈ ట్రాఫిక్ సమస్య సిటీలో పెరుగుతుందే  తప్ప తరగడం లేదు. ఇక ఈ ట్రాఫిక్ సమస్యలను  నివారించేందుకు ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలో ఏదైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ముందుగానే వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు పెడుతూ అలర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే..  తాజాగా నగరంలో నేటి నుంచి మరో 45 రోజుల పాటు ఆ ప్రాంతంలో వాహనదారుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ వివరాలేంటో చూద్దాం.

హైదరాబాద్ వంటి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. ఏదైనా పండగల సమయంలో, మరీ ఏ ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, మరమత్తులు జరిగినప్పుడు ముందుగానే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ చేస్తుంటారు. అంతేకాకుండా.. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం, వాహనాలను దారి మరలించడం వంటి చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్ లో వెళ్లే వాహనదారులకు పోలీసు అధికారుల అలర్ట్ చేశారు. ఎందుకంటే.. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పరిధిలో ఆరు లేన్ల ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే నిర్మాణ పనులు కారణంగా.. కిషన్ గూడ ర్యాంప్ లోని ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ అప్రోచ్ రోడ్డులో నేటి నుంచి అనగా ఆగస్టు 3 నుంచి 45 రోజుల పాటు రోడ్డును మూసి వేయబడుతుంది.

అందుకోసమే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ముందుగానే వాహనదారులకు అలర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఎయిర్ పోర్టునుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను బెంగళూరు వైపు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా NH-44లో ORR ఎమర్జెన్సీ ట్రామా సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టు వైపు వెళ్లే వాహనాలను యథావిధిగా వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయం పై వాహనదారులు సహకరించాలని పోలీసులు శాఖ కోరారు. కనుక ఈరోజు నుంచి అటు వైపు వెళ్లే వాహనదారులు ఈ విషయం గమనించి అటు వైపు వెళ్లకుండా ఉంటే మంచిది. మరీ, నగరంలో నిర్మాణ పనులు కారణంగా ఆ ప్రాంతంలో 45 రోజులు రోడ్డు మూసివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.