హైదరాబాద్‌లో హై అలర్ట్.. 10వ తేది వరకు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! ఎందుకంటే?

Traffic Restrictions: ఆషాడ మాసం వచ్చిందంటే హైదరాబాద్ లో బోనాల జాతరలతో సందడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు శుక్రవారం పూజలు నిర్వహించారు.

Traffic Restrictions: ఆషాడ మాసం వచ్చిందంటే హైదరాబాద్ లో బోనాల జాతరలతో సందడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు శుక్రవారం పూజలు నిర్వహించారు.

తెలంగాణ‌లో జులై 7 ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాల జాతర ప్రారంభం అవుతుంది. ఈ పండుగ మొదటి, చివరి రోజు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ‘బోనాలు’ గా ప్రసిద్ది చెందిన ఆషాఢ జాతరను రాష్ట్ర పండుగతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉజ్జయని మహంకాళి ఆలయం, సికింద్రాబాద్ సహా జంటనగరాల్లో దాదాపు 115 ఆలయాల్లో ‘ఆషాఢ మాసం’ పండగు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. తాజాగా హైదరాబాద్ వాసులకు హై అలర్ట్.. ఈ ఏరియాలో ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి.. ఏ ఏరియా అంటే. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలైంది. హైదరాబాద్ జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి.. మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణోత్సవానికి ముస్తాబవుతుంది. ఈ క్రమంలోనే ప్రధాన రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 10న సాయంత్రం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ నెల 9న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరగనుంది.. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్ కు పోలీసులు ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ మళ్లింపులు:

– సనత్ నగర్, ఫతేనగర్, బేగం పేట బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు సిక్స్ ఫీట్ రోడ్ నుంచి, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్ఆర్ నగర్, అమీర్ పేట మీదుగా తరలిస్తున్నారు.

– అమీర్ పేట్, బేగం పేట్ నుంచి వచ్చే వెహికిల్స్ ని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోని వైన్స్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా పంపిస్తున్నారు.

Show comments