iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Restrictions In Hyderabad: జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు రిహార్సల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions In Hyderabad: జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు రిహార్సల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్ నగరంలో ఉండే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం  వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో నరకం చూస్తుంటారు. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో కాస్తా మేర ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు. అలానే నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సంగతులు ఇలా ఉంటే.. ప్రత్యేక సందర్భాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా పండగలు, ఇతర వేడుకలు జరిగినప్పుడు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా కూడా వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్  ఆంక్షలు విధించినట్లు తెలిపారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరాన్ని మిని భారత్ అంటారు. కారణంగా ఇక్కడ దేశంలోనే అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూడా జీవనోపాధి కోసం నగరాన్ని వస్తుంటారు. ఈ క్రమంలోనే నగరంలో జనాభ పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. నేటికాలంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగి పోయింది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. అలానే మరిన్ని చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పండగలు, ఇతర వేడుకలు, ఏమైనా ర్యాలీలు ఉన్నప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే పోలీస్ అధికారులు సమాచారం ఇస్తుంటారు. ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయో తెలియజేస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రిహార్సల్స్ కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రిహార్సల్స్ వేడుకల సందర్భంగా గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్, ట్యాండ్ బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలు  ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఆయన ప్రాంతాల్లో సమయంతో సహా ఆంక్షలు విధించే వివారాలను పోలీసులు తెలిపారు. గన్ పార్క్ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్స్  వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. అలానే ట్యాంక్ బండ్ పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు  ఉంటాయన్నారు. మొత్తంగా ఆ మార్గాల్లో వెళ్లే వాహనదారులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెళ్లడం మంచింది. దీంతో సమయం, ట్రాపిక్  సమస్య తప్పుతుంది.