Arjun Suravaram
Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలెర్ట్ న్యూస్ ఒకటి వచ్చింది. నేడు అనగా శుక్రవారం నగరంలోని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాక మరికొన్ని రూట్లలో వాహనాలను మళ్లించనున్నారు.
Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలెర్ట్ న్యూస్ ఒకటి వచ్చింది. నేడు అనగా శుక్రవారం నగరంలోని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాక మరికొన్ని రూట్లలో వాహనాలను మళ్లించనున్నారు.
Arjun Suravaram
మహానగరరాల్లో ట్రాఫిక్ అనేది ఓ ప్రధాన సమస్యగా ఉంది. నిత్యం ఎంతో మంది ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అనేది పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే..హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం, పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించే సమయంలో ముందుగానే వాహనదారులను అలెర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం నగరంలోని కొన్ని మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
హైదరాబాద్ నగరంలో తరచూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ఈ క్రమంలోనే ముందుగానే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ చేస్తారు. ప్రస్తుతం నగరంలో బోనాల జాతర జరుగుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బొనాల వేడుకలు పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించం, వాహనాలను దారి మరలించడం వంటివి చేశారు. ఇలానే నగంరంలో పండగలు, జాతరలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు వాహనాలను దారి మరలిస్తుంటారు. ఇక పొరపాటున తెలియక ఆయా మార్గాల్లో వెళ్లినప్పుడు వాహనాదురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో ట్రాపిక్ లో చిక్కుకుంటారు. ఇది ఇలా ఉంటే నేడు అనగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎల్ బీ స్డేడియం లో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ జరగనుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
ఇటీవల పదోన్నతలు పొందిన 25 వేల మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని ఎల్ బీ స్డేడియంలో సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగానికి చెందిన అదనపు సీపీ పీ. విశ్వ ప్రసాద్ తెలిపారు. ఎల్ బీ స్టేడియం, అసెంబ్లీ, రవీంద్ర భారతి తదితర పరిసరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయడం లేదా మళ్లించడం చేస్తామన్నారు. కాబట్టి మధ్యాహ్నం సమయంలో అటుగా వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటే ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మొత్తంగా నేడు ఎల్ బీ స్డేడియం పరిసరాల్లో రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.