P Venkatesh
P Venkatesh
నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ మార్గాల్లో ఆ తేదీ వరకు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, భద్రతా పరమైన చర్యల దృష్ట్యా నగర వ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన భారీ గణనాథుడుని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నేటి నుంచి గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనదారులను అలర్ట్ చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఆంక్షలు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో 11 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారని, కాబట్టి భక్తులకు ఏవిధమైన ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
* రాజ్ దూత్ లైన్ నుంచి – గణేష్ టైపు రోడ్డులో ఎలాంటి వెహికిల్స్ కు అనుమతి లేదు. రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు.
* రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. అటు వైపు వెళ్లే వెహికిల్స్ ను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు.
* మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతి లేదు. అటుగా వెళ్లే వెహికిల్స్ ను మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు.