iDreamPost
android-app
ios-app

Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మారుస్తూ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

  • Published Dec 03, 2023 | 6:06 PM Updated Updated Dec 03, 2023 | 6:06 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది. ఈ క్రమంలో ప్రగతి భవన్ పేరు మార్చుతూ సంచలన ప్రకటన చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది. ఈ క్రమంలో ప్రగతి భవన్ పేరు మార్చుతూ సంచలన ప్రకటన చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మారుస్తూ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్స ర్యాలీలు చేపడుతూ.. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖరారు కావడంతో.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యదాపూర్వకంగా కలిశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రగతి భవన్ పేరు మార్చుతూ సంచలన ప్రకటన చేశారు. సామాన్యుల కోరకు సచివాలయం గేట్లు ఇక నుంచి తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఎన్నికల్లో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపాడు. తనదైన ప్రచార వ్యూహాలతో ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టి.. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఇక తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు గెలిచింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ విజయ భేరి మోగించిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు రేవంత్. ఇక నుంచి ప్రగతి భవన్ పేరు ‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్’  అని మారుస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా భవన్ గేట్లు సామాన్యుల కోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ఏ విధంగా పాలన అందించిందో.. ఇప్పుడు కూడా అదే విధంగా పాలన అందిస్తుందని చెప్పుకొచ్చారు. మరి ప్రగతి భవన్ పేరు మార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.