సాధారణంగా కిలో రూ.20 నుంచి రూ.30కి టమాటాలను విక్రయిస్తుంటారు. అలాంటి వీటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
సాధారణంగా కిలో రూ.20 నుంచి రూ.30కి టమాటాలను విక్రయిస్తుంటారు. అలాంటి వీటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడే కూరగాయ టమాట అనేది తెలిసిందే. దాదాపుగా ప్రతి కూరలోనూ దీన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా కిలో రూ.20 నుంచి రూ.30కి టమాటాలను విక్రయిస్తుంటారు. అలాంటి వీటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పంట దిగుబడి తగ్గడం, వర్షాల ప్రభావం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కేజీ టమాట రేటు డబుల్ సెంచరీ మార్క్‌ను దాటేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాస్తా ట్రిపుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతూ సామాన్యులను మరింతగా భయపెడుతోంది.
ప్రస్తుతం మదర్ డైరీ తన రిటైల్ స్టోర్స్‌లో కేజీ టమాటాలను రూ.259కి విక్రయిస్తోంది. ఇటీవల టమాట ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. కానీ పది రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సరఫరా బాగా తగ్గిపోయి.. ధరలు మళ్లీ పెరగడం మొదలైంది. టమాట ధరలు మరికొన్ని రోజుల్లో కిలోకు రూ.300 చేరుకుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. కాయగూరల టోకు ధరల వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారని అంటున్నారు.
కూరగాయల టోకు ధరల వ్యాపారులు నష్టాలు చూడటానికి.. టమాటతో పాటు క్యాప్సికం లాంటి ఇతర సీజనల్ కూరగాయల సేల్స్ భారీగా తగ్గిపోవడమే కారణమని తెలుస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాట ధర రూ.160 నుంచి ఒక్కసారిగా రూ.220కి ఎగబాకిందని వ్యాపారులు అంటున్నారు. రిటైల్ ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. టమాటలు ఎక్కువగా పండే హిమాచల్ ప్రదేశ్‌లో జులై నెలలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి టమాట పంటలు పాడైపోయి దిగుబడితో పాటు సరఫరా తగ్గిపోయింది. టమాట అధికంగా పండే ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కేజీ టమాట ధర రూ.300 చేరినా షాక్ అవ్వాల్సిన పనిలేదని హోల్‌సేల్ ట్రేడర్స్ అంటున్నారు.