iDreamPost

Tomato Price: సామాన్యుల నెత్తిన పిడుగు.. టమాటా మంట.. కిలో రూ.100కు చేరిన రేటు

  • Published Jun 19, 2024 | 10:33 AMUpdated Jun 19, 2024 | 10:33 AM

టమాటా ధర చూసి సామాన్యులు షాక్‌తో బిగిసుకుపోతున్నారు. నిన్నటి వరకు కిలో 60 వరకు ఉన్న ధర నేడు ఏకంగా 100 రూపాయలకు చేరింది. ఆవివరాలు..

టమాటా ధర చూసి సామాన్యులు షాక్‌తో బిగిసుకుపోతున్నారు. నిన్నటి వరకు కిలో 60 వరకు ఉన్న ధర నేడు ఏకంగా 100 రూపాయలకు చేరింది. ఆవివరాలు..

  • Published Jun 19, 2024 | 10:33 AMUpdated Jun 19, 2024 | 10:33 AM
Tomato Price: సామాన్యుల నెత్తిన పిడుగు.. టమాటా మంట.. కిలో రూ.100కు చేరిన రేటు

కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రేటు విషయంలో చికెన్‌, మటన్‌తో పోటీ పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కూడా కూరగాయలు ధరలు మాములుగానే ఉన్నాయి. ప్రతిదీ కిలో 50-60 రూపాయలలోపే లభించాయి. మరి ఇప్పుడో.. కూరగాయల ధరలు సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇంట్లో వంట చేయాలంటే.. ఉల్లి, టమాటా కచ్చితంగా ఉండాల్సిందే. మిగతా కూరగాయలు ఉన్నా లేకపోయినా.. ఉల్లి, టమాటా ఉంటే కూర గురించి భయం ఉండదు. జనాలు కూడా వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సీజన్‌లతో సంబంధం లేకుండా.. వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్‌ నెల ఆరంభం నుంచి.. ఉల్లిపాయ, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో రేటు వందకు చేరింది. ఆ వివరాలు..

వారం కిందటి వరకు కూడా టమాటా ధర కేవలం రూ.30-రూ.50 వరకు ఉంది. కానీ ఇప్పుడు అది ఏకంగా రెట్టింపై కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరుకుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాట రూ.100 పలుకుతోంది. నాగర్‌కర్నూల్‌ రైతు బజార్‌లో కిలో టమాట ధర రూ.100కు చేరింది. ఇక త్వరలోనే ఇది 200 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరోవైపు ఆకుకూరల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 3-5 కట్టల చొప్పున ఇవ్వగా.. ఇప్పుడు రూ.20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు.

The rate of tomato reached 100 per kg

టమాటా మాత్రమే కాక.. మిర్చి ధర కూడా ఘాటుగానే ఉంది. మార్కెట్‌లో పచ్చిమిర్చి ధర కిలో రూ.100 దాటింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాట పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామల నుంచి మార్కెట్లకు పంట రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటలు రాకపోవడంతో.. ధర విపరీతంగా పెరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.200 వరకు చేరే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. టమాటనే కిలో రూ.100 ఉంటే ఇక మిగిలిన కూరగాయలు ఎలా కొనాలి.. ఏం తినాలి అని వాపోతున్నారు సామాన్యులు.

అటు ఏపీలోనూ టమాటా రేటు పెరుగుతూనే ఉంది. ఏపీలోని పలు మార్కెట్లలో కిలో టమాట రూ.80 ఉండగా.. రవాణా ఛార్జీలు కలుపుకుని కొన్ని చోట్ల రూ.100 అమ్ముతున్నారు. రాష్ట్రంలోని మదనపల్లె, పలమనేరు నుంచి, కర్ణాటకలోని చింతామణి.. వంటి ఇతర ప్రాంతాల నుంచి టమోటాలు దిగుమతి అవుతున్నాయని హోల్‌సేల్‌ మార్కెట్‌ యార్డు అధికారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు 25 కిలోల టమాటాను రూ.1500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి రిటైలర్లకు కిలో రూ.75, వినియోగదారులకు రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి