iDreamPost
android-app
ios-app

తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. నేడు ఆ జిల్లాల్లో వానలు!

Weather Update In Telangana: తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసింది. భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెయిన్ కి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది.

Weather Update In Telangana: తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసింది. భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెయిన్ కి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది.

తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. నేడు ఆ జిల్లాల్లో వానలు!

కొన్ని రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసింది. భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం చోటుచేసుకుంది. అంతేకాక  పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వర్షం అంటేనే రాష్ట్ర ప్రజలు వణికిపోయే పరిస్థితి వచ్చింది.  ఈ నేపథ్యంలోనే వానల గురించి ఏ చిన్న సమాచారం వచ్చిన ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణకు వానలకు సంబంధించి ఓ కీలక అపక్ డేట్ వచ్చింది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కోల్ కతా సమీపంలో బలంగానే ఉంది. అది అక్కడి నుంచి నెమ్మెదిగా కదులుతూ జార్ఖాండ్, ఒరిస్సాల వైపు వెళ్లేలా ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. అలానే సోమవారానికి అనగా సెప్టెంబర్ 16 ఇది ఉత్తర ఛత్తీస్‌ గఢ్ వైపు వెళ్లి బలహీనపడనుందని చెప్పారు. ఇదే సమయంలో నైరుతీ రుతుపవనాలు మరీ అంత  చురుగ్గా లేవని పేర్కొంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. వచ్చే మూడ్రోజులు

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే గతంలో కురిసిన మాదిరిగా భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణలో మేఘాలు వస్తూ, పోతూ ఉంటాయని, వాతావరణం మాటి మాటికి మారుతు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో నేడు తెలికపాటి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఇలా ఉంటే.. సెప్టెంబరహ్ 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.  అయితే అప్పటి వరకు భారీ వానలకు అవకాశం లేదని అన్నారు.

ప్రజలు వానల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే వాతావరణంలో చోటు చేసుకునే అనుహ్య మార్పుల కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చిరు జల్లలులు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలకు మున్నేరు వాగు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది.  ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. మరికొందరు అయితే వరదలల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు 33 మంది మృతిచెందగా.. రూ.10వేల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా వాసులు ఈ భారీ వరదల పీడకలను ఇంకా మర్చిపోలేక పోతున్నారు.