iDreamPost
android-app
ios-app

ప్రేమకు అడ్డొస్తున్నారని.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపేశాడు!

  • Published Jul 11, 2024 | 11:21 AM Updated Updated Jul 11, 2024 | 11:21 AM

Warangal Crime News: ఈ మధ్య కాలంలో యువత పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా..ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.కొంత కాలం రిలేషన్ లో ఉంటూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.

Warangal Crime News: ఈ మధ్య కాలంలో యువత పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా..ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.కొంత కాలం రిలేషన్ లో ఉంటూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.

  • Published Jul 11, 2024 | 11:21 AMUpdated Jul 11, 2024 | 11:21 AM
ప్రేమకు అడ్డొస్తున్నారని.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపేశాడు!

ఇటీవల చాలామంది ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఒక్కోసారి హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పరువు హత్యలకు జరిగాయి. తమ కులం, మతం కాని వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఆ జంటపై హత్యకు తెగబడుతున్నారు కుటుంబ సభ్యులు.  ఇదిలా ఉంటే తాను ఎంతగానో ప్రేమించిన యువతికి మాయ మాటలు చెప్పి తన నుంచి విడిపోయేలా చేశారని ప్రేమికుడు కోపంతో యువతి తల్లిదండ్రులను అతి దారుణంగా నరికి చంపిన ఘటన వరంగల్ లో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా చెన్నారవుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది.ప్రేమ వివాహం కాదన్న కారణంతో ఓ యువకుడు భర్యాభర్తల గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పదహారు చింతల తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ (45), బానోతు సుగుణ(40) కుమార్తె దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు కలిసి కొంత కాలం చట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఈ క్రమంలోనే గత నవంబర్ లో బన్నీ, దీపిక ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి దీపిక ఇంట్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య దీపికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సమాచారం బన్నీకి తెలియడంతో ఉన్మాదిగా మారాడు. ఆమె తల్లిదండ్రులపై పగ పెంచుకొని గురువారం తెల్లవారుజామున పదునైన కత్తితో ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్, సుగుణపై దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే కన్నుమూసింది. శ్రీనివాస్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో దీపిక ఆమె సోదరుడు మదన్ లాల్ గాయపడ్డారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.