iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అంతలోనే..

  • Published Feb 05, 2024 | 10:53 AM Updated Updated Feb 05, 2024 | 10:53 AM

Sangareddy Crime News:పెళ్లై భర్తతో నిండు నూరేళ్లు జీవించాలని ఎన్నో కలలు కన్న ఓ వివాహితను దురదృష్టం వెంటాడింది..

Sangareddy Crime News:పెళ్లై భర్తతో నిండు నూరేళ్లు జీవించాలని ఎన్నో కలలు కన్న ఓ వివాహితను దురదృష్టం వెంటాడింది..

  • Published Feb 05, 2024 | 10:53 AMUpdated Feb 05, 2024 | 10:53 AM
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అంతలోనే..

ఇటీవల ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకువస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటారు. రోడ్డు ప్రమాదం, హార్ట్ ఎటాక్, విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో వారి కుటుంబాలల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. గత ఏడాది వివాహం జరిగింది.. ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా ఉన్న ఆ జంటపై విధి పగబట్టింది. ఎవరూ ఊహించని సంఘటన ఆ ఇంట జరిగింది.  వివరాల్లోకి వెళితే..

ఆందోల్.. మాసానిపల్లికి చెందిన బంటు పవిత్ర (21) ఆదివారం ఉదయం అందరినీ సంతోషంగా పలకరించింది. తర్వాత వాటర్ హీటర్ తో నీటిని వేడి చేసేందుకు రెడీ అయ్యింది. అదే సమయంలో అనుకోకుండా విద్యుత్ సప్లై అవుతున్న హీటర్ ని తాకింది. దీంతో పవిత్రకు విద్యుత్ షాక్ తగిలి పెద్దగా కేకలు వేస్తూ కిందపడిపోయింది. పక్క రూమ్ లో ఉన్న భర్త నవీన్ లేచి ఆమెను పట్టుకోబోయాడు.. అతనికి షాక్ తగిలినట్లు అనిపించడంతో వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను వెంటనే ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స చేసి అప్పటికే కన్నుమూసినట్లు  ధృవీకరించారు. ఆ మాట విన్న భర్త నవీన్ గుండెలవిసేలా కన్నీరు పెట్టుకున్నాడు.

అందరితో ఎప్పుడూ సంతోషంగా కలివిడిగా కలిసి ఉండే పవిత్ర కన్నుమూసిన విషయం తెలిసిన గ్రామస్థులు, బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. బెడ్ పై ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి తల్లి సుశీల కన్నీరు మున్నీరయ్యింది. పెళ్లై ఏడాది కూడా కాలేదే.. ఇంతలోనే దేవుడి వద్దకు వెళ్లావా బిడ్డా అంటూ బోరున ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టుకున్నారు. పవిత్ర చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన వెంటనే నవీన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అధికారులు వచ్చి పవిత్ర  మృతదేహాన్ని పంచనామా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.