Arjun Suravaram
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు వారు ఫుల్ బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు వారు ఫుల్ బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి. డబ్బులు సంపాదించాలని, సొంత ఇళ్లు కొనుకోవాలని, కారు కొనాలని, మంచి ఉద్యోగం సాధించాలని.. ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి. అలానే మహిళకు కూడా రాజకీయంగా ఉన్నత స్థితికి చేరాలని కోరుకున్నారు. ప్రజాలకు సేవ చేయాలని భావించారు. అలానే రాజకీయాల్లోకి తన భర్తతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే లోక సభ ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఒకటి తలిస్తే..విధి ఒకటి తల్చింది. చివరకు ఆమె ఇంట విషాధం నింపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు వారు ఫుల్ బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మృతి చెందారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది.
భూపాలపల్లి జిల్లా యామన్‌పల్లిలో సాయంత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాముత్తారం కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి(45) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అక్కడ ప్రజలకు కాంగ్రెస్ చేపట్టిన పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే కలిగే ఉపయోగాలు ఏమిటో ఆమె ప్రజలకు వివరించారు. అలా గురువారం యామన్ పల్లిలో కీర్తిబాయి ఫుల్ ప్రచారం చేశారు. అనంతరం పెగడపల్లి అనే గ్రామంలో కూడా ఎన్నిక ప్రచారం నిర్వహించడాని సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే కీర్తి బాయి ఆమె భర్త స్తంభంపల్లి(పి.పి) గ్రామ మాజీ సర్పంచి జాడి రాజయ్యతో కలిసి కారులో బయల్దేరారు. ఇద్దరు కలిసి కారులో బయలు దేరగా.. నిమ్మగూడెం సమీపంలో ఘోరం చోటుచేసుకుంది. ఆ గ్రామం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగా వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి మట్టి కుప్పను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కీర్తిబాయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాని గమనించినా అటుగా వెళ్తున్న వాహనదారులు ఇరువురిని బయటికి తీశారు. గాయపడిన రాజయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇక కీర్తిబాయి 15 ఏళ్లుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారు. స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరాలనే ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ దిశగా సాగుతోన్న ఈక్రమంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించింది.