iDreamPost
android-app
ios-app

పెళ్లి ఇంట విషాదం.. పెళ్లి దుస్తులతోనే తిరిగిరాని లోకానికి వధువు!

వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో ఆ యువతి తన ఇష్టమైన వాడిని మనువాడింది. ఇక కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న ఆ యువతిని మృత్యువు వెంటాడింది. పెళ్లైన ఒకరోజులోనే పసుబట్టలతోనే తిరిగి రాని లోకానికి వెళ్లింది.

వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో ఆ యువతి తన ఇష్టమైన వాడిని మనువాడింది. ఇక కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న ఆ యువతిని మృత్యువు వెంటాడింది. పెళ్లైన ఒకరోజులోనే పసుబట్టలతోనే తిరిగి రాని లోకానికి వెళ్లింది.

పెళ్లి ఇంట విషాదం.. పెళ్లి దుస్తులతోనే తిరిగిరాని లోకానికి వధువు!

చాలా మంది యువత తమ పెళ్లిళ్ల  గురించి ఎన్నో కలలు కంటారు. తమకు రాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. అలానే చాలా మంది తమ ఆశలకు, కోరికలకు తగ్గట్లుకానే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుని సంసార జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అలానే ఓ యువతి కూడా తనకు నచ్చిన వ్యక్తితో పెద్దల సమక్షంలో తాళికట్టించుకుంది. వేదమంత్రాల సాక్షిగా ఆ యువతి వివాహం ఘనంగా జరిగింది. ఇక అత్తింట అడుగుపెట్టాల్సి యువతి కాటికి వెళ్లింది. పెళ్లిదుస్తులతోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన జనగాం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెళ్లి అనేది జీవితంలో మధురమైన వేడుక. దీని ఎంతో ఘనంగా జరుపుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు తమ పెళ్లి జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకుంటూ ఓ యువతి..తనకు నచ్చిన వ్యక్తిని వివాహం ఆడింది. సంసార జీవితంలో అడుగు పెట్టి భర్తతో ఎంతో సంతోషంగా గడపాలని అనుకుంది. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరోకటి తలచింది. ఆ నూతన వధువు ఆశలను ఛిద్రం చేస్తూ..ఆమె కుటుంబ నుంచి దూరం చేసింది. రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ఆ వధువును కాటేసింది. జనగాం జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరిని కలచి వేసింది.

జనగాం జిల్లా నరిమెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి హనుమకొండకు చెందిన తిలక్ కొంతకాలం క్రితం వివాహం నిశ్చమైంది. అలానే ఈనెల 21 తేదీన స్వాతి, తిలక్ ల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లైన మరుసటి రోజు, సోమవారం వధువరులు, వారి తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్లారు. అక్కడ నూతన దంపతులు రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు. అక్కడ చాలా సేపు కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధువరులు సంతోషంగా గడిపారు. అనంతరం వధువురులు వారి కుటుంబ సభ్యులు  కారులో తిరిగి హనుమకొండకు బయలు దేరారు.

ఈ క్రమంలోనే మానుకొండూర్ మండలం గట్టుదుద్దనపల్లి సమీపంలో వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్ కిందకు దూసుకెళ్లింది. దీంతో వారు కారులో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు, పోలీసులు వారిని బయటకి తీసి 108 వాహనంలో అదే రోజు రాత్రి కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు  స్వాతి చికిత్స పొందుతూ మూడు రోజుల తరువాత చనిపోయింది. నవ వధువు చనిపోవడంతో పెళ్లింట విషాదం అలుముకుంది. కాళ్లపారణి ఆరక ముందే ఆ యువతికి నూరేళ్లు నిండాయి. పెళ్లి దుస్తులతోనే లోకాన్ని విడిచిపోవడంతో అందరిని కలచి వేస్తోంది. ఇక వధువు మృతి వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పెళ్లైన ఒకరోజులోనే నవ వధువు మరణించంతో  ఆ కుటుంబ వేదన వర్ణాతీతం. ఇలా రోడ్డు ప్రమాదాల కారణం ఎంతో మంది నూరెేళ్ల జీవితం అర్దాంతరంగా ముగుస్తుంది.