ప్రేమ పెళ్లిళ్లకు ఒప్పుకోలేదని 3 నెలల వ్యవధిలో.. అన్నా- చెల్లి ఆత్మహత్య!

Rajanna sircilla- Vemulawada News: ప్రేమ పెళ్లిళ్లకు అంగీకరించలేదని ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సంతానం ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలచివేసింది.

Rajanna sircilla- Vemulawada News: ప్రేమ పెళ్లిళ్లకు అంగీకరించలేదని ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సంతానం ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలచివేసింది.

ప్రేమ పెళ్లిళ్లు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. మారుతున్న కాలంతో పెళ్లిళ్లు, ప్రేమలు కూడా మారుతూనే వచ్చాయి. ఇప్పుడు పిల్లల సంతోషమే ముఖ్యం అంటూ పెద్దలు కూడా ఒక మెట్టు దిగి కోరుకున్న వారితో వివాహాలు చేస్తున్నారు. అయితే అందరి ప్రేమ సుఖాంతం అవ్వాలని.. అవుతుందని గ్యారెంటీ లేదు. ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమకథలు కూడా అలాగే అయ్యాయి. మూడు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఇద్దరూ వాళ్ల గ్రామానికే చెందిన ఒకే కుటుంబంలోని అబ్బాయి, అమ్మాయిలను ప్రేమించారు. అయితే వీళ్ల వివాహాలకు పెద్దలు ఒప్పుకోలేదని ఇంతటి దారుణ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషాద ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో జరిగింది. నూకలమర్రికి చెందిన లింగయ్య- పద్మ దంపతుల పిల్లలే ఇలా 3 నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు ప్రశాంత్(22), నవ్య ఇద్దరు సంతానం. నవ్యకు 6 నెలల క్రితం వివాహం చేశారు. అయితే ఆమె భర్త గల్ఫ్ వెళ్లాడు. మూడు నెలల క్రితం తాను ఐదేళ్ల నుంచి ఒక యువకుడిని ప్రేమిస్తున్నాను అంటూ ఇంట్లో చెప్పింది. అదే గ్రామానికి చెందిన అబ్బాయితో తనకు వివాహం జరిపించమని కోరిందట. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. పెద్దలు ఒప్పుకోలేదని పురుగుల మందు తాగి నవ్య ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ తర్వాత తాజాగా ప్రశాంత్ కూడా తాను ఒక అమ్మాయిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు.. నవ్య ప్రేమించిన అబ్బాయి వాళ్ల సోదరి. అయితే ప్రశాంత్ తల్లిదండ్రులు ఆ పెళ్లికి అంగీకరించలేదు. దాంతో.. ప్రశాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన ప్రశాంత్ ను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ప్రస్తుతం ఈ అన్నా- చెల్లెలి ఆత్మహత్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

Show comments