iDreamPost
android-app
ios-app

రైతు రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి! నేటి నుంచే..

Telangana Rythu Runa Mafi: ఇటీవలే తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జులై నుంచి ఆగష్టు మధ్య విడతల వారీగా రైతు రుణమాఫీ చేసింది. ఇదే సమయంలో కొందరికి రుణమాఫీ కాలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి నేటి నుంచి...

Telangana Rythu Runa Mafi: ఇటీవలే తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జులై నుంచి ఆగష్టు మధ్య విడతల వారీగా రైతు రుణమాఫీ చేసింది. ఇదే సమయంలో కొందరికి రుణమాఫీ కాలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి నేటి నుంచి...

రైతు రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి! నేటి నుంచే..

తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ  చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి  వచ్చిన తరువాత ఉచిత బస్సు, మహాలక్ష్మి,  గృహలక్ష్మీ వంటి పథకాలను అమలు చేసింది. అయితే పంట రుణమాఫీ మాత్రం ఆలస్యమైంది. ఇటీవలే జులైన నుంచి ఆగష్టు మధ్యలో విడతల వారిగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించి మరీ పంట రుణమాఫీ చేసింది. ఈ క్రమంలో కొందరికి రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు పలు రైతుల నుంచి ఇతర ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ రైతు రుణమాఫీ పథకంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక ప్రోగామ్స్ నిర్వహించనుంది.  రైతు రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని మండల కేంద్రంలోని వ్యవసాయా శాఖ అధికారుల ఆఫీస్ లో ఏవోలు అన్నదాతలకు అందుబాటులో ఉంటారు. ఈ డ్రైవ్ లో మండలంలో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మండల వ్యవసాయ అధికారులు పాల్గొంటారు.

రైతులు ఇచ్చే ఫిర్యాదులను తీసుకుని వాటిని పంట రుణం వీవర్స్ పోర్టల్‌లో చెక్ చేస్తారు. అందులో ఉన్న సమాచారం రైతులకు అందజేస్తారు. దీని ద్వారా రైతుకు ఎంత రుణమాఫీ అయింది, ఎంత కాలేదో తెలిసిపోతుంది. అంతేకాక ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉంటే కూడా తెలిసిపోతాయి. రైతు పంట రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు తెలియజేస్తారు. ఏమైనా రైతులకు సంబంధించిన సమాచారంలో తప్పులు ఉంటే వాటిని సరి చేసి.. ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తారు. కుటుంబానికి ప్రత్యేకంగా రేషన్‌ కార్డు లేకపోతే రైతు కుటుంబం ఆధార్ కార్డులు తీసుకుంటారు. రైతుకు పాస్‌బుక్‌ లేకపోతే పట్టాదారు పాసుపుస్తకం వచ్చినా అప్లోడ్ చేయాలి.

రుణం తీసుకున్న వారి ఆధార్ కార్డును పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అసలు, వడ్డీ మొత్తంతో సరిపోలకపోతే రైతు నుంచి దరఖాస్తును తీసుకుని వివరాలను నమోదు చేస్తారు. రైతుల నుంచి తీసుకున్న వివరాల నిర్ధారణ కోసం ఆ వివరాలను బ్యాంకులకు పంపుతారు. మొత్తంగా రైతు రుణమాఫీ కానీ వారు.. భూములకు సంబంధించి పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి వివిధ కీలక పత్రాలను తీసుకుని ప్రభుత్వం నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన వచ్చు.  ఈ రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు పంట రుణమాఫీ అమలు కాకపోవడానికి ఉన్న కారణాలను బట్టి దానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందచేస్తే రుణమాఫీ వర్తిస్తుందని చెబుతున్నారు.